ఐశ్వ‌ర్యా రాయ్ కాదు...సాగ‌ర క‌న్య‌!

Update: 2018-05-13 06:46 GMT
ప్రియా ప్రియా చంపొద్దే....నవ్వీ న‌న్నే ముంచొద్దే....చెలీ క‌న్నుల‌తో హృద‌యం కాల్చొద్దే....అయ్యో వ‌న్నెల‌తొ ప్రాణం తీయొద్దే.....అంటూ ఓ సినీక‌వి ఐశ్వ‌ర్యా రాయ్ అందాన్ని పొగుడుతూ గేయ‌ర‌చ‌న చేశారు. పాతికేళ్ల క్రితం ప్ర‌పంచ సుంద‌రి కిరీటాన్ని శిగ‌లో తురుముకున్న ఈ అందాల రాశి సౌంద‌ర్యం ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. త‌ల్లి అయిన త‌ర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట చేసిన ఐష్ త‌న అందం...అభిన‌యంలో ఏమాత్రం తేడా రాలేద‌ని ప్రూవ్ చేసుకుంది. తాజాగా జ‌రిగిన కేన్స్  ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో ఐష్ త‌న అందంతో ఆహూతుల‌ను క‌ట్టిప‌డేసింది. సాగ‌ర క‌న్య త‌ర‌హాలో క‌ళ్లు మిరుమిట్లు గొలిపేలా డిజైన్ చేసిన డ్రెస్ తో రెడ్ కార్పెట్ పై ఐశ్వ‌ర్యా రాయ్ మెరిసిపోయింది. రెడ్ కార్పెట్ పై ఐష్ న‌డిచివ‌స్తున్నంత సేపు అక్క‌డున్న‌వారంతా చూపు తిప్పుకోలేదు.

ప్ర‌తి ఏడాది లాగే 2018 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో ఐశ్వ‌ర్యా రాయ్ సంద‌డి చేసింది. 44 ఏళ్ల వ‌య‌సులో కూడా ఐష్....క‌ళ్లు మిరిమిట్లుగొలిపే సొగ‌సుతో చూప‌రుల‌ను క‌ట్టిప‌డేస్తోంది. ప్ర‌ఖ్యాత డిజైన‌ర్ మైఖేల్ డిజైన్ చేసిన ఊదా, న‌లుపు వ‌ర్ణం డ్రెస్ లో ఐష్ త‌ళుక్కున మెరిసింది. పొడ‌వాటి గౌన్ కు చివ‌ర సాగ‌ర క‌న్య త‌ర‌హాలో డిజైన్ (బటర్ ఫ్లై డిజైన్ ) చేయ‌డంతో ....ఐష్ న‌డ‌చివ‌స్తోన్న సాగ‌ర‌ క‌న్యలా క‌నిపించింది. కేన్స్ తొలిరోజు రెడ్ కార్పెట్ పై ఐశ్వ‌ర్యా రాయ్ సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా నిలిచింది. ఐష్ అందం ముందు మిగ‌తా వారంత దిగ‌దుడుపేనంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌కుముందు ఐష్...మ‌నీష్ అరోరా డిజైన్ చేసిన నీలం రంగు డ్రెస్ లో అద‌ర‌గొట్టింది. అయితే, మైకేల్ డిజైన్ చేసిన సాగ‌ర‌క‌న్య డ్రెస్ లో ఐష్ మ‌రింత అందంగా క‌నిపించి ఆహూతుల‌కు క‌నువిందు చేసింది.

Click Here For More Photos
Tags:    

Similar News