హాలీవుడ్‌ లో మరో ప్రయత్నం

Update: 2019-04-12 06:29 GMT
అందంకు నిర్వచనం అంటూ కుర్రకారు అంతా కూడా అమితంగా ఆరాధించే ఐశ్వర్య రాయ్‌ గతంలో హాలీవుడ్‌ చిత్రాల్లో నటించింది. అయితే హాలీవుడ్‌ లో ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు. దాంతో ఎక్కువగా బాలీవుడ్‌ పైనే ఈమె ఫోకస్‌ పెట్టింది. బాలీవుడ్‌ లో ఈమె కొన్నాళ్ల గ్యాప్‌ తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీతో ఈ అమ్మడు పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. చేసిన సినిమా చేసినట్లుగానే ఫ్లాప్‌ అవుతూ వస్తున్నాయి. అయినా కూడా ఐశ్వర్య క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌ లో రెండు మూడు సినిమాలు చేయడంతో పాటు, కోలీవుడ్‌ లో కూడా ఒక భారీ చిత్రంలో నటిస్తోంది.

తాజాగా ఈమెకు హాలీవుడ్‌ నుండి పిలుపు వచ్చింది. బాలీవుడ్‌ లో టైం బాగాలేని ఈ సమయంలో హాలీవుడ్‌ లో అయినా సక్సెస్‌ కలిసి వస్తుందేమో అనే ఉద్దేశ్యంతో ఐశ్వర్య రాయ్‌ ఇంగ్లీష్‌ సినిమాకు ఓకే చెప్పినట్లుగా బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు. ఈ ఏడాది చివర్లో ఐశర్య రాయ్‌ నటించబోతున్న హాలీవుడ్‌ మూవీ పట్టాలెక్కబోతుందట. బాలీవుడ్‌ కు చెందిన పలువురు హీరోయిన్స్‌ హాలీవుడ్‌ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఏ ఒక్కరు కూడా అక్కడ స్టార్‌ స్టేటస్‌ ను దక్కించుకోలేక పోయారు. మరి ఇప్పుడు ఐశ్వర్య అయినా అక్కడ సక్సెస్‌ ను దక్కించుకుంటుందా అనేది చూడాలి.

Tags:    

Similar News