టన్నుల కొద్దీ స్టార్ డమ్ ఉన్నా.. దాన్ని ఏ మాత్రం తలకెక్కించుకోని సినీతారలు కొందరు ఉంటారు. వారెప్పుడూ ప్రేక్షకుల మనసుల్ని దోచుకోవటమే కాదు.. తమ మాటలతో సామాన్యుల హృదయాల్ని కొల్లగొడుతుంటారు. తన అందంతో.. అభినయంతో కోట్లాది మందిని ఫిదా చేసిన ఐశ్వర్యారాయ్ కు సంబంధించి చూస్తే.. ఆమె కూల్ గా ఉండటమే కాదు.. అనవసరమైన వివాదాలకు అవకాశం ఇవ్వరు.
వయసు మీద పడుతున్నా.. పడుచు పిల్లలతో పోటీ పడే అందం ఐష్ సొంతం. కుర్ర హీరోయిన్లు సైతం కుళ్లుకునేంత సౌందర్యంతో మెరిసిపోయే ఈ భామ వీలైనంత వరకూ ప్రాక్టికల్ గా మాట్లాడటానికే ఇష్టపడతారన్న పేరుంది. నమ్రతతో ఉంటూ..మీడియాతో స్నేహపూర్వకంగా మాట్లాడే నటీమణుల్లో ఐష్ ఒకరు.
ఇక.. ఐష్ జీవితం చూస్తే.. ఒకసినిమా కథకు సరిపోయేంత డ్రామా ఆమె జీవితంలో కనిపిస్తుంది. ఒక సాదాసీదా ఆర్కిటెక్చర్ స్టూడెంట్.. తాను గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంటర్ కావాలన్న కోరికే.. ఈ రోజు ఐష్ ను కోట్లాదిమందికి భిన్నంగా నిలిపించిందని చెప్పాలి. అలా కాకుండా.. అందరిలా ఆలోచిస్తే.. ఆమె కోట్లమందిలో ఒకరిగా ఉండేవారనటంలో ఎలాంటి సందేహం లేదు.
ఆర్కిటెక్చర్ స్టూడెంట్ నుంచి మిస్ వరల్డ్ వరకూ ప్రయాణం ఒక ఎత్తు అయితే.. తనకు లభించిన ఇమేజ్ ను బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ స్థాయికి చేరుకోవటానికి ఐష్ పడిన శ్రమ అంతా ఇంతా కాదు. అనంతరం ప్రేమ ఎపిసోడ్ కు సంబంధించిన చేదు అనుభవాన్ని పక్కన పెట్టి.. బచ్చన్ కోడలిగా ఆమె నిర్ణయం మరో ఎత్తుగా అభివర్ణిస్తారు.
ఇప్పుడు నడుస్తోన్న బయోపిక్ ల కాలంలో ఐష్ బయోపిక్ తీస్తే.. బోలెడంత డ్రామాతో పాటు స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా ఉంటారు. ఇదే విషయాన్ని ఐష్ ను క్వశ్చన్ చేసినప్పుడు ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బయోపిక్ తీస్తే వాస్తవాల్ని దాచకూడదన్నది తన అభిప్రాయంగా చెప్పారు. తన జీవితం గొప్ప కథ అవుతుందన్న ఆమె.. ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుందంటే.. తప్పకుండా తన బయోపిక్ తెరకెక్కాలని తాను అనుకుంటానని చెప్పారు. అయితే.. ఇప్పటికైతే అలాంటి ఆలోచన లేదని తేల్చారు.
అంతా బాగానే ఉంది కానీ.. ఐష్ కానీ బయోపిక్ తీస్తే.. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు.. రియల్ లైఫ్ లో.. సల్మాన్.. వివేక్ ఓబరాయ్ ఎపిసోడ్లకు సంబంధించిన జస్టిఫికేషన్ ఎలా ఉంటుందన్న క్వశ్చన్ ప్రతి ఒక్కరికి కలగటం ఖాయం. ఆమె చెప్పినట్లుగా నిజాల్ని దాచకుంటే మాత్రం.. ఐష్ మరో సంచలనం కావటం ఖాయం.