శంకర్ తెరకెక్కించిన `జీన్స్` రిలీజై ఇప్పటికే రెండు దశాబ్ధాలు అయ్యింది. 24 ఏప్రిల్ 1998న ఆ చిత్రం రిలీజైంది. ఇందులో ఐశ్వర్యారాయ్ నటనను ఇప్పటికీ అభిమానులు మరువలేరు. ముఖ్యంగా ఆ చిత్రంలో కవలలు అయిన ప్రశాంత్ బ్రదర్స్ ని మ్యానేజ్ చేసే పాత్రలో ఐష్ ద్విపాత్రాభినయం అబ్బురపరుస్తుంది. ఆ రోజుల్లోనే కంప్యూటర్ మాయాజాలంతో డ్యుయల్ రోల్ లో ఐష్ ని చూపించిన తీరు మైమరిపించింది. కన్నులతో చూసేది గురువా... పాటకు పరవశించని వారే లేరు. అయితే ఆ తరువాత ఐష్ ని డ్యుయల్ రోల్ లో చూపించేందుకు ఏ దర్శకుడూ సాహసం చేయలేదు. మళ్లీ ఇన్నాళ్టికి ఓ దర్శకదగ్గజం ఆ ప్రయత్నం చేయబోతున్నాడు. ఐశ్వర్యారాయ్ అభిమానులకు డబుల్ ట్రీట్ ని అందించడానికి రెడీ అవుతున్నాడు. తమిళ దిగ్గజ దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావిస్తున్న `పొన్నియన్ సెల్వన్` చిత్రాన్ని త్వరలో తెరపైకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే.
సౌత్ ఇండియాలోనే మెగా బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా తెరపైకి రానున్న ఈ సినిమాలో విక్రమ్- కార్తి, జయం రవి- మోహన్ బాబు- కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని తెలిసింది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం చేయబోతోంది. చోళరాజు పెరియ పెళవిట్టారియర్ భార్య నందినిగా.. ఆమె కూతురు మందాకిని దేవిగా రెండు పాత్రల్లో కనిపించబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీగా నిర్మాణం జరుపుకోనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ చివరి దశకు చేరుకున్నాయి.
ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్న తారలంతా ఇప్పటికే తమ పాత్రలకు సంబంధించిన వేషధారణ కోసం సిద్ధమవుతున్నారు. కొంత మంది జుట్టు కూడా పెంచుకున్నారు. మణిరత్నం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రాన్ని ఒకేసారి నాలుగు భాషల్లో నిర్మించడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. మద్రాస్ టాకీస్ బ్యానర్ - లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.