కార్పొరెట్ గురూలకే చెమటలు పట్టే శైలి.. ఆ స్టైల్ కి ఆ రూపానికి కకావికలం అవ్వాల్సిందే. అంతగా కవ్విస్తున్న ఈ నవజవ్వని ఎవ్వరు? అని అంటారా?.. పరిచయం అఖ్కర్లేని ఐశ్వర్యం. ది గ్రేట్ బచ్చన్ ల కోడలు. నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్నా ఐష్ లో అందం చందం.. మిసమిస .. ఏమాత్రం తగ్గలేదనడానికి ఇదిగో ఈ ఫోటోనే ప్రూఫ్. స్టైల్ అన్న పదానికే ఐష్ ఓ నిర్వచనం. ఫ్యాషనిస్టా.. ఫ్యాషన్ ఐకన్.. అన్న పదాలకు ఆల్టర్నేట్ మీనింగ్ ఉంటే అది ఐశ్వర్యారాయ్ అని డిక్లేర్ చేసి తీరాలి.
అంత స్ట్రైకింగ్ కనిపిస్తోంది ఈ ఫోటోలో. ఐష్ చూపుల్లో స్టెన్ గన్ నుంచి దూసుకొచ్చే బుల్లెట్టు కుర్రాళ్ల గుండెల్ని చిద్రం చేసేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. జేమ్స్ బాండ్ సిరీస్ చిత్రాలకు లేడీ బాస్ గా వృద్ధ కపోతాల్ని ఎంపిక చేసుకుంటారు కానీ, అసలు ఇలాంటి ఒక లేడీబాస్ ఉంటే ఎలాంటి సంచలనాలకు తావిస్తుందో ఓసారి ఊహించండి. `చార్లెస్ ఏంజెల్స్` చిత్రాలకు ఆకతాయి కథానాయికల్ని వెతుక్కునే క్రమంలో ఐష్ పేరు పరిశీలిస్తే ఎంత బావుంటుందో అంచనా వేయండి.
స్టన్నింగ్ ఖాకీ కలర్ సూట్ లో అంతే స్టన్నింగ్ ఫోజుతో వేడి పెంచేసింది ఐష్. మొన్నటికి మొన్న కాంజీవరం కంచిపట్టు చీర కట్టుకుని అంబానీల పెళ్లిలో దర్వనమిచ్చిన ఐష్ ఇంతలోనే ఇలా మారిపోయిందేంటబ్బా! అంటూ ఫ్యాన్స్ ఖంగు తింటున్నారు. ప్రఖ్యాత ఫిలింఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీకి ఇలా ఫోజులిచ్చింది. కవర్ చినిగిపోయిందంతే!!