ముద్దులపై ఐష్ ఆన్సర్ ఎవరికో?

Update: 2016-11-14 19:30 GMT
ఐశ్వర్యారాయ్ బచ్చన్ రీసెంట్ మూవీ యే దిల్ హై ముష్కిల్.. థియేటర్లలో సందడి చేస్తోంది. కరెన్సీ నోట్ల కొరత దెబ్బకి కలెక్షన్స్ పడిపోయిన మాట వాస్తవమే అయినా.. ఈ లోపే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చేయడమే ఊరట కలిగించే విషయం. అయితే.. సినిమా రిలీజ్ కంటే ముందు.. యే దిల్ హై ముష్కిల్ ని బాగా వార్తల్లో నిలబెట్టిన అంశాల్లో ఐష్-రణబీర్ ల కిస్సింగ్స్.. ఇంటిమేట్ సీన్స్.

రీసెంట్ గా ఈ సీన్స్ పై ఐష్ అత్తగారైన జయాబచ్చన్ కూడా స్పందించింది. ఇప్పుడు ఐశ్వర్యారాయ్ కూడా ఈ టాపిక్ పై మొదటిసారిగా నోరు విప్పింది. 'నేను ధూమ్ చేసినప్పటి నుంచి ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ధూమ్ కి ముందు తర్వాత కూడా హాలీవుడ్ నుంచి ఆఫర్లు చాలానే వచ్చాయి. కానీ ఆన్ స్క్రీన్ పై ఇంటిమేట్ సీన్స్ విషయంలో నేను కంఫర్టబుల్ గా ఫీల్ కాలేదు. అందుకే వాటిని తిరస్కరించాను' అని చెప్పింది ఐష్.

'అప్పటికి ఇప్పటికి జనాల ఆలోచన పరిధి మారింది. అలా అనుకుని ఇండియన్ స్క్రీన్ పై కొంతమేర ప్రయత్నిద్దాం అనుకున్నా. అయినా సరే యే దిల్ హై ముష్కిల్ విషయంలో వచ్చిన రియాక్షన్ ఆశ్చర్యానికి గురి చేసింది. పైగా ప్రేమ ఎక్కువగా ఉండే ప్లేస్ నుంచే ఇవి వినిపించాయి. నేను వారందరికీ సొంతం అనుకునేంతగా ప్రేమించాశారు. అందుకే ఇలాంటి రియాక్షన్ వచ్చింది' అంటూ ఐశ్వర్యారాయ్ చెప్పిన మాటలు.. జయా బచ్చన్ కు ఇచ్చిన రియాక్షన్ అంటున్నారు బాలీవుడ్ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News