మీడియాలో తరచూ ఐశ్వర్యారాయ్ బచ్చన్ కు సంబంధించిన వార్త ఏదొ ఒకటి దర్శనమిస్తుంది. కానీ.. ఆమె మాత్రం మీడియాకు దూరంగా తన పనేదో తాను చేసుకుంటూ పోతుంటారు. మీడియాతో పెద్దగా మాట్లాడని బాలీవుడ్ ప్రముఖుల్లో ఐష్ ఒకరు. ఆమ మామ బిగ్ బీ అమితాబ్ మీడియాకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటంతో ఆయనకు సంబంధించిన ఫీలింగ్స్ ఎప్పటికప్పుడు తెలిసే పరిస్థితి.
విషయం ఏదైనా తనదైన మౌనంతో ఉండే ఐష్.. తాజాగా మాత్రం ప్రధాని మోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దుపై నోరు విప్పారు. ఒక ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంగా నోట్ల రద్దుపై తన మనసులోని మాటను బయటపెట్టటమే కాదు.. ప్రస్తుత పరిస్థితిపై తాను ఎలా ఫీల్ అవుతుందన్న విషయాన్ని స్పష్టం చేసిందని చెప్పాలి. భారతీయురాలిగా ప్రధాని మోడీని తాను నిజాయితీతో అభినందిస్తున్నట్లుగా చెప్పింది. పెద్దనోట్ల రద్దు చేస్తూ మోడీతీసుకున్న నిర్ణయంపై ప్రధానిని అభినందించిన ఆమె.. ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకున్నారని.. దేశంలోని అవినీతికి చెక్ పెట్టేందుకు వీలుగా విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లుగా పేర్కొంది.
మార్పు అంత సౌకర్యంగా ఉండదని.. ప్రతి ఒక్కరూ తమకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని విస్తృత ప్రయోజనాల కోణంలో చూస్తే.. సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న మాటను చెప్పేసింది. ఓపక్క ప్రధాని తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై రాజకీయ పార్టీలుకొన్ని తీవ్రంగా తప్పు పడుతున్న వేళ.. అందుకు భిన్నంగా ఐష్ మాత్రం మోడీని అభినందించటమే కాదు.. నోట్ల రద్దు కారణంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని పెద్ద మనసుతో అర్థంచేసుకోవాలని.. మార్పు కోసం జరుగుతున్న ప్రయత్నంలో ఇలాంటివి ఓర్చుకోవాలన్న రీతిలో చెప్పిన వైనంపై ప్రముఖులు ఎలా రియాక్ట్ అవుతారో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/