కేన్స్ 2019 ఉత్సవాలు ఈనెల 25తో ముగియనున్నాయి. మరో రెండ్రోజుల పాటు ఫ్రెంచి రివెరాలో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ ఏడాది కేన్స్ ఉత్సవాల్లో మునుపెన్నడూ లేనంతగా బాలీవుడ్ అందగత్తెలు తమ హొయల్ని ప్రదర్శించారు. ముఖ్యంగా మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ ఈసారి మునుపటి కంటే హాట్ అప్పియరెన్స్ ఇచ్చి అందరికీ పెద్ద షాకిచ్చారు.
కేన్స్ అంటేనే ఐశ్వర్యారాయ్. ఈ భారతీయ అందాన్ని ప్రత్యేకంగా వీక్షించేందుకు ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా వేచి చూస్తుందన్న సంగతి తెలిసిందే. వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీలంతా కొలువు దీరే ఈ యూనిక్ వేదికపై ఐష్ రకరకాల డిజైనర్ డ్రెస్ లలో షేక్ చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది మరింత స్పెషల్ అప్పియరెన్స్ తో అదరగొట్టారు. షో ఆరంభమే బంగారు వర్ణం మత్స్యాన్ని తలపించిన డ్రెస్ లో ఐష్ అదరగొట్టారు.
తాజాగా ఐశ్వర్యారాయ్ కేన్స్ అప్పియరెన్స్ కి సంబంధించిన మరో కొత్త లుక్ రివీలైంది. ఈసారి పూర్తిగా వైట్ అండ్ వైట్ డిజైనర్ లుక్ లో కనిపించింది. ఈ డ్రెస్ డిజైన్ కాస్తంత భారీతనంతో దిద్దడం ఆసక్తికరం. ఒక రకంగా కొలనులో ఒకదానితో ఒకటిగా అల్లుకున్న తామరాకుల్ని తలపించే విధంగా ఈ డిజైన్ ని రూపొందించారు. దీనిని తెల్లరంగు రఫెల్డ్ గౌన్ అని ఫ్యాషన్ డిజైనర్స్ పిలుస్తున్నారు. కేన్స్ ఆద్యంతం ఐష్ తో పాటుగా ఆరాధ్య చిలౌట్ చేసిన సంగతి తెలిసిందే. మామ్ ఐశ్వర్యారాయ్ తో కలిసి ఆరాధ్య రెడ్ కార్పెట్ నడకలు నడవడం అభిమానుల్లో చర్చకు వచ్చింది. ఇక ఐష్ ఇన్ స్టాలో రకరకాల డిజైనర్ లుక్ తో ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.