కోలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు 'కౌసల్య క్రిష్ణమూర్తి' తో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా రేపే విడుదలవుతుంది. తమిళ సినిమా 'కణా' సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై చాలానే ఆశలు పెట్టుకుంది ఐశ్వర్య. తమిళ్ లో అప్పటికే 25 సినిమాలు చేసిన ఐశ్వర్య కి 'కణా' నటిగా మంచి గుర్తింపు తెచ్చింది. తమిళ్ లో ఈ సినిమాను శివ కార్తికేయన్ నిర్మించాడు. అంతే కాదు కోచ్ పాత్రలో కూడా నటించాడు.
ఇప్పుడు కోలీవుడ్ లో తనకి కలిసొచ్చి, సక్సెస్ అందుకున్న కథతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతుంది ఐశు. తమిళ్ లో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన 'కణా' ఇప్పుడు తెలుగులో కూడా అదే రేంజ్ సక్సెస్ అందిస్తుందని నమ్ముతుంది. నిజానికి కౌసల్య కృష్ణమూర్తి ఆమెకు తెలుగులో రెండో సినిమా. ముందుగా విజయ్ దేవేరకొండ -క్రాంతి మాధవ్ సినిమాకు సైన్ చేసింది. కానీ అనుకోకుండా 'కణా' తెలుగు రీమేక్ లో ఛాన్స్ కొట్టేసింది.
మహిళా క్రికెటర్ కథతో ఎమోషనల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కానీ సక్సెస్ అయితే తెలుగులో మరింత జోరు పెంచాలని చూస్తుంది అమ్మడు. దీని తర్వాత ఎలాగూ విజయ్ సినిమా కూడా ఉంది. ఈ రెండు సినిమాలు తనకు టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు తెచ్చిపెడతాయని భావిస్తుంది. మరి ఐశ్వర్య రాజేష్ టాలీవుడ్ లో కూడా క్లిక్ అవుతుందా...చూడాలి.