పిక్ టాక్ : భర్త నుండి విడిపోయాక కొడుకులతో..!

Update: 2022-07-19 05:32 GMT
తమిళ సూపర్‌ స్టార్‌ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ఇటీవలే ధనుష్ తో తన 18 ఏళ్ల వైవాహిక జీవితం కు స్వస్థి చెప్పిన విషయం తెల్సిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరు కోలీవుడ్‌ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎంతో మంది సినీ సెలబ్రెటీ కపుల్‌ కు ఆదర్శంగా నిలిచారు. ఎంతో మంది విడిపోయినా.. విడి పోతున్నా కూడా వీరు మాత్రం కలిసి జీవిస్తున్న తీరును ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించారు.

కానీ ఈ ఏడాది ఆరంభంలో వీరి మధ్య ఏర్పడిన గొడవలు చిలికి చిలికి.. అన్నట్లుగా మారి విడిపోయే వరకు వచ్చింది. ఇద్దరు విడి పోవడానికి నిర్ణయించుకున్న తర్వాత కుటుంబ సభ్యులు ఎంతగా చెప్పినా కూడా వారు కలిసి ఉండే అవకాశం లేదని తేల్చి చెప్పారు.

వారికి ఇద్దరు కొడుకులు. వారిద్దరు కూడా ఇప్పుడు పెద్ద వారు అయ్యారు. కనుక పిల్లల కోసం కూడా కలిసి ఉండాల్సిన అవసరం లేదని వారు భావించారట.

ఇద్దరికి కూడా కొడుకులు అంటే అత్యంత ప్రేమ.. అనురాగం. ఆ విషయాన్ని ఇటీవలే ధనుష్ సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇద్దరు కొడుకులతో ఉన్న ఫోటోను షేర్‌ చేయడం ద్వారా ఐశ్వర్య తో వీడి పోయినా కూడా తాను ఇద్దరు కొడుకులకు దగ్గరగా ఉంటున్నట్లుగా చెప్పకనే చెప్పాడు. తాజాగా ఐశ్వర్య కూడా తన ఇద్దరు కొడుకుల ఫోటో ను షేర్‌ చేసింది.

ఇద్దరు కొడుకులను హగ్‌ చేసుకుని ఎమోషనల్‌ అయినట్లుగా ఐశ్వర్య రజినీకాంత్‌ ఫోటోను షేర్‌ చేసింది. ఐశ్వర్య రజినీకాంత్‌ ఫోటోతో పాటు కొన్ని సార్లు వారి నుండి కేవలం ఒక హగ్గు మాత్రమే చాలు.. ఇతర విషయాలు ఏమీ అక్కర్లేదు అన్నట్లుగా పోస్ట్‌ చేసింది. ఆ పోస్ట్‌ లో మరియు ఫోటోలో ఎంతో ఎమోషన్‌ కనిపిస్తుందని సినీ జనాలు మరియు ప్రేక్షకులు చెబుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ధనుష్‌ బ్యాక్ టు బ్యాక్ మ్యూజిక్‌ వీడియోస్‌ తో పాటు వెబ్‌ సిరీస్ లు మరియు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రజినీకాంత్‌ కూతురు.. ధనుష్ మాజీ భార్య అవ్వడం వల్ల ఐశ్వర్య ఏం చేసినా కూడా సోషల్‌ మీడియాలో చాలా చర్చ జరుగుతుంది. కనుక ఆమె ఈ తాజా పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.
Tags:    

Similar News