అజయ్ దేవగణ్ 'ఖైదీ' అక్టోబర్ నుండి..?

Update: 2020-04-02 06:50 GMT
ఇటీవల కాలంగా కంటెంట్‌ ప్రధానంగా సాగే చిత్రాలకు, తెరకెక్కించే దర్శకులకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఆ చిత్రాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి పోటీ పడుతుంటారు. ఇప్పటికే మన దక్షిణాదిలో హిట్ అయిన చాలా సినిమాలను హిందీలో రీమేక్ చేసారు. వాటితో బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో కార్తీ హీరోగా ఇటీవల ఘనవిజయం సాధించిన తమిళ సినిమా ఖైదీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. తమిళ్‌తో పాటు తెలుగులోనూ 'ఖైదీ' సినిమా సూపర్‌ హిట్ అయ్యింది. కేవలం ఒక్క రాత్రిలో జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మధ్య దక్షిణాది పరిశ్రమల సినిమాల పై ఆసక్తిగా ఉన్న బాలీవుడ్ నిర్మాతలకు ఈ చిత్రం బాగా నచ్చింది. అందుకే ఈ రీమేక్ చిత్రంలో స్టార్ హీరోనే ఉంచాలని భావించి అజయ్ దేవగన్ ను సంప్రదించగా అజయ్ దేవగన్ సైతం ఈ చిత్రాన్ని చూసి వెంటనే డేట్స్ ఇచ్ఛేసిన సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు ఈ సినిమా షూటింగ్ వెనక్కి వెళ్లిన సంగతి తెలిసింది.

ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అక్టోబర్ ఫస్ట్ వీక్ నుండి ఈ రీమేక్ మూవీ షూటింగ్ ను మొదలుపెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. 2021 ఫిబ్రవరి 12న ఈ రీమేక్ విడుదలవుతుందని కూడా అజయ్ దేవగన్ అనౌన్స్ కూడా చేశారు. ఇక కేవలం హీరో మీద, మాస్ ఎంలిమెంట్స్, ఫాధర్, డాటర్ ఎమోషన్ మీదే నడిచిన ఈ చిత్ర కథ హిందీ ప్రేక్షకులకి కొత్త అనుభూతిని అందిస్తుందని భావించిన రిలయన్స్ ఎంటెర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. కార్తి హీరోగా ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధించింది. మరి అజయ్ దేవగన్ హీరోగా ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తోందో చూడాలి. అజయ్ దేవగన్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రం ద్వారా మన తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న విషయం తెలిసిందే.
Tags:    

Similar News