తమిళ సూపర్ స్టార్ అజిత్ కరోనా లాక్ డౌన్ కు ముందు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుతున్నాడు. లాక్ డౌన్ కారణంగా మొత్తం వాహనాలు ఎక్కడికి అక్కడ నిలిచి పోయాయి. దాంతో ఆయన బైక్ పై హైదరాబాద్ నుండి చెన్నై వరకు వెళ్లారు అంటూ వార్తలు వచ్చాయి. షూటింగ్ ను అర్థాంతరంగా ఆపేసి హైదరాబాద్ నుండి చెన్నైకు ప్రత్యేక పర్మీషన్ తీసుకుని వెళ్లిన హీరో అజిత్ మళ్లీ ఇన్ని రోజుల తర్వాత హైదరాబాద్ కు రాబోతున్నాడట. సినిమా షూటింగ్ ఎక్కడ అయితే ఆగిందో అక్కడే మళ్లీ మొదలు పెట్టేందుకు అజిత్ త్వరలో హైదరాబాద్ కు రాబతున్నాడు.
అజిత్ వలిమై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఆ సినిమా షూటింగ్ హైదరాబాద్ షెడ్యూల్ బ్యాలన్స్ ఉంది. ఈ ఏడాది చివరి వరకు సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబాలని భావిస్తున్నారట. హెచ్ వినోధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను బోణీ కపూర్ నిర్మిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాపై తమిళనాడులో అంచనాలు భారీగా ఉన్నాయి. తమిళంతో పాటు తెలుగు.. హిందీ.. కన్నడ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో అజిత్ కు జోడీగా నయనతార కనిపించబోతున్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.