తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ను ఢీ కొట్టే సత్తా కోలీవుడ్ లో మరెవ్వరికి లేదనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్బుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రజినీకాంత్ దాదాపు 27 ఏళ్లుగా తన ప్రతి సినిమాతో కూడా అద్బుతమైన వసూళ్లను సాధిస్తూ వస్తున్నాడు. తన ఫ్లాప్ చిత్రాలతో కూడా భారీగా వసూళ్లు దక్కించుకున్న ఘనత కేవలం రజినీకాంత్ కే దక్కింది. ఈ పాతికేళ్ల కాలంలో రజినీకాంత్ ను ఏ హీరో కూడా బీట్ చేయలేక పోయాడు. రజినీకాంత్ సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ ను విజయ్, అజిత్ సాధించి ఉండవచ్చు కాని, రజినీకాంత్ తో పోటీ పడ్డ సమయంలో మాత్రం ఎవరు కూడా సూపర్ స్టార్ ను బీట్ చేయలేక పోయారు.
ఇన్నాళ్లకు రజినీకాంత్‌ను అజిత్ తన 'విశ్వాసం' చిత్రంతో బీట్ చేశాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన 'పేట' మరియు 'విశ్వాసం' చిత్రాలు ఒకే రోజున విడుదల అయిన విషయం తెల్సిందే. రెండు సినిమాలకు కూడా పాజిటిక్ టాక్ దక్కింది. రెండు చిత్రాల్లో కూడా మాస్ ఎలిమెంట్స్ భారీ స్థాయిలో ఉండటంతో తమిళ ఆడియన్స్ పండుగ చేసుకుంటున్నారు. బయట కలెక్షన్స్ వదిలేస్తే తమిళనాడు బాక్సాఫీస్ వరకు తీసుకుంటే మాత్రం అజిత్ పై చేయి సాధించినట్లుగా ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
1992లో రజినీకాంత్ మరియు కమల్ హాసన్ లు బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టారు. ఆ పోటీలో కమల్ హాసన్ నటించిన మూవీ పై చేయి సాధించింది. అయితే అప్పటి నుండి మళ్లీ ఎప్పుడు కూడా రజినీకాంత్ నెం.2కు పడిపోలేదు. కాని ఇప్పుడు అజిత్ వల్ల నెం.2కు పడిపోయాడు. తమిళనాడు వ్యాప్తంగా రెండు సినిమాలు భారీగానే వసూళ్లు రాబడుతున్నప్పటికి అజిత్ విశ్వాసం మాత్రం ఇంకాస్త బెటర్ గా రాబడుతోంది. దాంతో అజిత్ ఈ సంక్రాంతికి విజేతగా ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ చూసుకుంటే మాత్రం పేటకు ఎక్కువ వస్తున్నట్లుగా తెలుస్తోంది.
Full View