తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాను బోణీ కపూర్ నిర్మిస్తున్నాడు. వీరి ముగ్గురి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడో సినిమా ఇది కావడం విశేషం. మొదటి రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోగా ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు హెచ్ వినోద్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ సినిమా యొక్క టైటిల్ ను అనౌన్స్ చేయడంతో పాటు అజిత్ కుమార్ యొక్క ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేయడం జరిగింది. సినిమా కి తునివు అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. దృడత్వం అనే అర్థం వచ్చే ఈ టైటిల్ అజిత్ అభిమానులకు మస్త్ గా నచ్చేసిందట.
ఇక సినిమాలోని అజిత్ లుక్ కి కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఫస్ట్ లుక్ లో అజిత్ చాలా స్టైలిష్ గా మిషన్ గన్ పట్టుకుని ఉన్న స్టిల్ కి అంతా కూడా వావ్ అంటున్నారు. అయితే ఇదే సమయంలో ఆయన లుక్ విషయంలో కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ అజిత్ యొక్క ఓల్డ్ లుక్ ని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు.
తెల్ల జుట్టు మరియు తెల్ల గడ్డం ముసలి హీరో మళ్లీ రాబోతున్నాడు అంటూ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలోని ఆయన లుక్ ను చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తున్నారు. గతంలో ఇలాంటి లుక్ లో అజిత్ కనిపించిన సమయంలో కూడా యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడం జరిగింది.
వాలిమై సినిమాలో మంచి యంగ్ లుక్ లో కనిపించిన అజిత్ ఇప్పుడు మళ్లీ ఇలా తెల్ల వెంట్రుకలతో ఓల్డ్ లుక్ లో కనిపించబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ లో కూడా కొందరు పెదవి విరుస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి సోషల్ మీడియాలో తునివు గురించిన చర్చ హై పిచ్ లో జరుగుతూ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో మంజు వారియర్ కీలక పాత్రలో నటిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.