మేకింగ్‌ వీడియో : హాలీవుడ్ యాక్షన్‌ చూపించబోతున్నారు

Update: 2021-12-15 06:32 GMT
తమిళ సినీ అభిమానులు ముఖ్యంగా అజిత్ అభిమానులు దాదాపు రెండేళ్లుగా ఎదురు చూస్తున్న చిత్రం వాలిమై. కరోనా వల్ల గత ఏడాది రావాల్సిన వాలిమై కాస్త వచ్చే ఏడాది పొంగల్ కు విడుదల అవ్వబోతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా ఉంటుందని మొదటి నుండి మేకర్స్ చెబుతూనే ఉన్నారు. కరోనా వల్ల షూటింగ్ ఆలస్యం అవ్వడంతో అజిత్ అభిమానులు అసహనంతో రగిలి పోతున్నారు.

వాలిమై అప్‌డేట్‌ ఎప్పుడు ఎప్పుడు అంటూ చిత్ర నిర్మాత బోనీ కపూర్‌ మరియు దర్శకుడు హెచ్ వినోద్‌ ను సోషల్‌ మీడియా ద్వారా అడుగుతూనే ఉన్నారు. ఇప్పటికే ఫస్ట్‌ లుక్ విడుదల అయ్యింది.. అయినా కూడా అభిమానులు ఇంకా అప్డేట్‌ కావాలి.. వీడియో కావాలంటూ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు వాలిమై మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

అజిత్ కు సహజంగానే బైక్ రైడ్స్ అంటే చాలా ఇష్టం. ఆయన రియల్‌ రేసర్‌ అనే విషయం తెల్సిందే. దాంతో బైక్ రేసింగ్‌ సన్నివేశాలు ఈ సినిమాలో కుప్పలు తెప్పలుగా ఉండనున్నాయి అని మేకింగ్ వీడియో చూస్తుంటే అర్థం అవుతోంది. హాలీవుడ్‌ యాక్షన్‌ సన్నివేశాలు.. హాలీవుడ్‌ చేజింగ్‌ సన్నివేశాల రేంజ్ లో వాలిమై లో అజిత్ యాక్షన్ అండ్‌ బైక్ చేజింగ్‌ సన్నివేశాలు చేసినట్లుగా ఈ వీడియో చూస్తుంటే అనిపిస్తుంది.

అద్బుతమైన యాక్షన్ తో పాటు మంచి డ్రామా కూడా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. మేకింగ్ వీడియోలో పూర్తిగా యాక్షన్ అండ్ చేజింగ్ సన్నివేశాలనే చూపించారు. ఒక చేజింగ్‌ సన్నివేశంలో అజిత్ కింద పడ్డది చూపించారు.

గతంలో ఎన్నో సార్లు ప్రమాదంకు అజిత్ గురయ్యాడు. కాని ఎప్పుడు కూడా ఆయన పట్టు వదల్లేదు. రెగ్యులర్ గా తన సినిమాల్లో యాక్షన్ డోసు మరియు ఛాలెంజింగ్ ఫీట్స్ డోసు పెంచుతూనే వచ్చాడు.

తాజాగా ఈ సినిమా లో కూడా అంతకు మించి అన్నట్లుగా సాహసాలు చేశాడు. దెబ్బలు తగిలినా.. ఏం జరిగినా కూడా ఆహా అన్నట్లుగా ఆయన ఫీట్స్ కొనసాగాయని ఈ వీడియో తో తెలిసి పోతుంది. అజిత్ అభిమానులతో పాటు ప్రతి ఒక్క తమిళ సినీ అభిమాని కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వాలిమై తెలుగు లో కూడా విడుదల అవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వాలిమై లో అజిత్ కు జోడీగా హ్యూమా ఖురేషి హీరోయిన్‌ గా నటించగా మన తెలుగు యంగ్‌ హీరో ఆర్ ఎక్స్ 100 ఫేమ్‌ కార్తికేయ విలన్ గా కనిపించబోతున్నాడు. వాలిమై లో అతడి లుక్ ను ఈ వీడియోలో రివీల్‌ చేశారు.

అజిత్ వంటి స్టార్‌ హీరో సినిమాలో విలన్ పాత్ర చేయడం వల్ల ఖచ్చితంగా తమిళంలో మనోడికి మంచి భవిష్యత్తు ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Full View
Tags:    

Similar News