రెండేళ్ల క్రితం బాలీవుడ్ లో వచ్చిన పింక్ ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అమితాబ్ బచ్చన్ లాయర్ గా లైంగిక వేధింపుల నేపద్యంలో హత్య కేసును ఎదురుకోవాల్సి వచ్చిన పాత్రలో తాప్సీ పన్ను నటన మంచి పేరు తీసుకురావడమే కాక సినిమాను సూపర్ హిట్ చేసాయి. ఇప్పుడు దీని రీమేక్ దిశగా అడుగులు పడుతున్నాయి. అజిత్ విశ్వాసం తర్వాత ఆయన 59వ సినిమాగా పింక్ రీమేకే ఉంటుందని గత కొన్ని రోజులుగా చెన్నై మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి.
అజిత్ తరఫున వ్యక్తులు అలాంటిది ఇంకా ఏది ఖరారు కాలేదు అని కొట్టిపారేస్తుండగా ఒరిజినల్ దర్శకుడు సూజిత్ సిర్కార్ మాత్రం హక్కులు కొన్న మాట వాస్తవమే అని కాకపోతే అక్కడ వేరే దర్శకుడితో ఉంటుందని పూర్తయ్యాక ఫైనల్ వెర్షన్ తనకు చూపిస్తామని మాట ఇచ్చారని చెబుతున్నాడు. పింక్ సౌత్ కు సంబంధించిన రీమేక్ హక్కులు స్వర్గీయ శ్రీదేవి భర్త నిర్మాత బోనీ కపూర్ దగ్గర ఉన్నాయి. అజిత్ కు ఈ ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉంది. ఇంగ్లీష్ వింగ్లిష్ లో చిన్న క్యామియో కూడా చేసాడు అజిత్. ఆ సమయంలోనే బోనీ కపూర్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తానని శ్రీదేవికి మాటిచ్చాడని కాని అది కార్యరూపం దాల్చే లోపే ఆవిడ కాలం చేయడంతో ఇది ముందుకు సాగలేదు.
అందుకే పింక్ రీమేక్ పట్ల అజిత్ ఆసక్తి చూపుతున్నాడని చెన్నై మీడియా న్యూస్. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. సంక్రాంతికి విశ్వాసం విడుదల అయ్యాకే అజిత్ ఫ్రీ అవుతాడు. అయినా కమర్షియల్ ఫార్ములాకు దూరంగా ఎలాంటి మాస్ మసాలాలు లేకుండా సీరియస్ ఇష్యూ మీద సాగే పింక్ రీమేక్ లో నిజంగా అజిత్ నటిస్తాడా. అలా చూసేందుకు అభిమానులు ఒప్పుకుంటారా. ఈ కన్ఫ్యూజన్ తీరాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడక తప్పదు