నందమూరి బాలకృష్ణ `అఖండ` మూడవ వారంలోకి ప్రవేశించింది. పోటీబరిలో అల్లు అర్జున్ `పుష్ప- ది రైజ్` నుంచి గట్టి పోటీ ఉన్నా 18వ రోజు కూడా అద్భుత వసూళ్లను సాధించిందని ట్రేడ్ రిపోర్ట్ చెబుతోంది. ఇప్పటికి 76 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ ని అఖండ వసూలు చేసింది. అలాగే 100 కోట్లు పైగా గ్రాస్ మార్క్ ను అందుకుంది. ఇది బాలకృష్ణ కెరీర్ బెస్ట్ షేర్ (బెస్ట్ గ్రాసర్) అందించిన చిత్రంగా నిలిచింది.
మూడో వారాంతంలోనూ ఆశ్చర్యకరంగా అఖండ అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. తొలి వారం తొలి వీకెండ్ అంటూ లెక్కలు వేసే ఈ రోజుల్లో ఇది నిజంగా హోప్ ని పెంచే రిజల్ట్ అని చెప్పాలి. అఖండకు ఈ శని- ఆదివారాల్లో వసూళ్లు మరింత మెరుగ్గా ఉన్నాయని ఎగ్జిబిటర్స్ చెబుతున్నారు.
ఆశ్చర్యకరంగా హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ లతో పాటు అన్ని తరగతుల థియేటర్లలో ఈ చిత్రం మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఏపీ తెలంగాణలో చాలా ఇతర థియేటర్లలో ఆక్యుపెన్సీ చాలా బాగుందని తెలిసింది. ఇప్పటికీ ఈ చిత్రం చెప్పుకోదగ్గ థియేటర్లను కలిగి ఉంది.
వచ్చే వారాంతంలో అలాగే క్రిస్మస్ హాలిడే వీకెండ్ తో ఈ సినిమా మరింతగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. బోయపాటి - బాలకృష్ణ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సింహా -లెజెండ్ రికార్డులను అధిగమించడమే గాక ఈ కాంబోలో బెస్ట్ హిట్ గా నిలిచింది. హ్యాట్రిక్ విజయంతో బోయపాటి టాలీవుడ్ లో తన స్టార్ డైరెక్టర్ హోదాను నిలబెట్టుకుని తదుపరి వరుసగా అగ్ర హీరోలతో పని చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఆంధ్రాలో అఖండ హవా
ఏపీలో అఖండ వసూళ్ల హవా పలు థియేటర్లలో కొనసాగుతోంది. విజయవాడ-కర్నూలు సహా ఉత్తరాంధ్రలో పలు మాస్ థియేటర్లలో అఖండ హవా సాగుతోంది. తాడిపత్రి - 4 థియేటర్లు 2వ రోజు గ్రాస్ - 4 లక్షలు పైగా వసూలు చేయగా..#అఖండ ఇదే తాడిపత్రి - సింగిల్ థియేటర్ 2వ రోజు గ్రాస్ - 5.6 లక్షలు వసూలు చేసిందని తెలిసింది.
మాస్ గాడ్ నటసింహ హవా ఆ రేంజులో ఉందని బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అఖండ మాస్ జాతర మూడో వారంలోనూ కొనసాగుతోందని కొన్ని థియేటర్ల నుంచి వస్తున్న కలెక్షన్స్ చెబుతున్నాయి.
అనీల్ రావిపూడితో భారీ చిత్రం
బాలయ్య `అఖండ`తో మరో భారీ హిట్ అందుకుని రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు. `సింహ`..`లెజెండ్` తర్వాత `అఖండ` తో హ్యాట్రిక్ హిట్ కొట్టి చూపించారు. బాలయ్య బ్రాండ్ ఇమేజ్ మరింత మెరుగుపడింది. కొత్త కమిట్ మెంట్లు జోరందుకున్నాయి. త్వరలోనే గోపీచంద్ మలినేని తో 107వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు.
ఇప్పటికే సినిమా లాంచింగ్ కూడా పూర్తయింది. ఇది బాలయ్య మాస్ ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత మరికొంత మంది దర్శకులు లైనప్ లో ఉన్నారు. అయితే ఎందరు వెయింటింగ్ లో ఉన్నా బాలయ్య మాత్రం యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనీల్ రావిపూడితో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
బాలయ్య ఎనర్జీని మ్యాచ్ చేసే స్క్రిప్ట్ తో లాక్ చేసిన నేపథ్యంలో రావిపూడితోనే ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య 108 మాత్రం అనీల్ తో దాదాపు ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 60 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నట్లు సమాచారం. సాహో గారపాటి.. హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. `అఖండ` వసూళ్ల ధీమాతోనే నిర్మాతలు బాలయ్య పై అంత బడ్జెట్ వెచ్చించడానికి రెడీ అవుతున్నారట.