స్టార్ హీరోతో సినిమా తాప్సీకి అంత సమ్మగా ఉంటుందా!
అయితే తాప్సీ కి స్టార్ హీరోల సరసన సినిమా ఛాన్సులు రావని? ఒకవేళ వచ్చినా నో చెబుతుందనే విమర్శలున్నాయి.
స్టార్ హీరోతో నటించే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ వదులుకోదు. అలాంటి అవకాశం ఎప్పుడొస్తుందా? అని ప్రతీ భామ ఎదురు చూస్తుంది. వచ్చినప్పుడు పోటీ ఉన్నా ఎలాగైనా ఆ ఛాన్స్ తనకే రావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుం టుంది. ఒక్కోసారి ఇలాంటివి ఇద్దరు భామల మధ్య తీవ్ర వివాదాలకు సైతం దారి తీస్తుంటాయి. అలాంటి సందర్భాలెన్నో చోటు చేసుకున్నాయి. అయితే తాప్సీ కి స్టార్ హీరోల సరసన సినిమా ఛాన్సులు రావని? ఒకవేళ వచ్చినా నో చెబుతుందనే విమర్శలున్నాయి.
తాజాగా వాటి గురించి అమ్మడు తొలిసారి ఓపెన్ అయింది. అలాగే స్టార్ హీరోలతో జర్నీ ఎక్స్ పీరియన్స్ కూడా పంచుకుంది. `చాలా మంది ప్రేక్షకులు నేను పెద్ద హీరోలతో నటించనని, అలాంటి అవకాశాలు కూడా నా దగ్గరకు తక్కువగా వస్తాయంటారు. కానీ నాకు ఎలాంటి ఒత్తిడి లేకుండా వెనుక సీట్లో కూర్చునే సినిమాలంటేనే ఇష్టం. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. గత ఏడాది షారుక్ ఖాన్ తోకలిసి `డంకీ`లో నటించాను.
ఆ సినిమా రిలీజ్ సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. ఎందుకంటే దర్శకుడు రాజ్ కుమార్..షారుక్ లాంటి అద్భుతమైన వ్యక్తులున్నారు. అలాంటప్పుడు నేను ఒత్తిడి తీసుకోవాల్సిన పనిలేదు. వాళ్ల ఇమేజ్ తో సినిమా వెళ్లిపోతుంది. వాళ్లు ముందు సీట్లు కూర్చుని కారు నడుపుతుంటే వెనుక సీట్లో నేను కూర్చుని ఆస్వాదిస్తాను. అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఏ హీరోయిన్ అయినా ఎందుకు కాదంటుంది.
స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అంటే? చాలా సేఫ్ గా ఉండొచ్చు. ఎంచక్కా పారితోషికం కూడా కరెక్ట్ గా అందుతుంది. ఇలా ఇన్ని సౌకర్యాలు ఉన్న సినిమా అవకాశాన్ని నేను ఎందుకు కాదంటాను. డబ్బు అంటే నాకేమైనా చేదు అను కుంటున్నారా? నాపై జరిగే అసత్య ప్రచారాలవన్నీ` అని అంది.