'అఖండ' సినిమా చూసిన వాళ్లంతా చాలా కాలం తరువాత మళ్లీ బాలకృష్ణకి తగిన సినిమా పడిందని చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ ఇంతవరకూ చేస్తూ వచ్చిన పవర్ఫుల్ పాత్రల వరుసలో అఖండ ముందువరుసలో వచ్చి కూర్చుంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అఘోరగా బాలకృష్ణ తన విశ్వరూపం చూపించారని అంటున్నారు.
ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను పోషించిన శ్రీకాంత్ కు .. పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించిన కాలకేయ ప్రభాకర్ కి కూడా మంచి పేరు వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో కాలకేయ ప్రభాకర్ ఈ సినిమాను గురించి మాట్లాడాడు.
'అఖండ' సినిమా ఇంటర్వెల్ కి ఓ 20 నిమిషాల ముందు నుంచి, క్లైమాక్స్ వరకూ తల తిప్పనివ్వదు. సాధారణంగా మల్టీప్లెక్స్ కల్చర్ ఎలా ఉంటుందంటే, తెరపై ఏదైనా నచ్చిన సీన్ వస్తే డీసెంట్ గా .. సైలెంట్ గా చప్పట్లు కొడతారు. కానీ ఈ సినిమాకి నేను వెళితే అక్కడ మాస్ థియేటర్లో మాదిరిగా ఒకటే ఈలలు .. గోలలు. 'బాహుబలి' తరువాత నాకు మంచి పేరు తీసుకొచ్చిన పాత్ర ఇది.
థియేటర్ల దగ్గర జనాలు ఎగబడిపోయి టిక్కెట్లు తీసుకునే సన్నివేశాలను నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. చాలా కాలం తరువాత అలాంటి వాతావరణాన్ని ఈ సినిమాకి చూశాను.
పబ్లిక్ టాక్ ను చూస్తే .. థియేటర్లో నుంచి బయటికి వచ్చిన వాళ్లలో 99 శాతం మంది బ్లాక్ బస్టర్ హిట్ అనే చెబుతున్నారు. ఇంతమంది నోటి వెంట ఒకటే టాక్ రావడమనేది అంత ఈజీ కాదు. అలాంటి ఈ సినిమాలో ఒక మంచి పాత్ర చేసే అవకాశాలు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
నేను ఒక ఆర్టిస్టుగా కాకుండా ఒక సాధారణ ప్రేక్షకుడిగానే ఈ సినిమాను చూశాను. 'జై బాలయ్య .. జై బాలయ్య' అని ఎన్నిసార్లు అరిచానో నాకే తెలియదు. అంతగా కథలో ఇన్వాల్వ్ అయ్యాను.
అప్పట్లో 'ప్రేమదేశం' సినిమా వస్తుంటే .. 'ముస్తఫా ముస్తఫా' పాట వస్తుంటే ఆడియన్స్ స్క్రీన్ దగ్గర డాన్స్ చేసేవారు. మళ్లీ ఇంతకాలానికి 'జై జై జై బాలయ్య' పాటకి డాన్స్ చేస్తున్నారు. ఒకసారి బోయపాటి గారు నాకు ఒక మంచి పాత్రను ఇవ్వాలని అనుకున్నారు గానీ కుదరలేదు. తరువాత సినిమాలో చూద్దామని అన్నారు.
అలాగే అంటారులే అనుకున్నాను. కానీ ఈ సినిమా కోసం నాకు కాల్ చేసి పిలిపించారు .. పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇచ్చారు. ఇంతవరకూ నేను చేస్తూ వచ్చిన పాత్రలకి కొత్తగా ఈ పాత్రలో చూపించారు. ఈ పాత్రకి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పుకొచ్చాడు.