నందమూరి బాలకృష్ణ - మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ''అఖండ''. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత జనాలను సినిమా హాళ్ల వైపు నడిపించి టాలీవుడ్ కు కొండంత ధైర్యాన్నిచ్చింది. బాలయ్య - బోయపాటి కాంబోకి తిరుగులేదని నిరూపించింది.
తెలుగు రాష్ట్రాల్లోని కాకుండా ఓవర్ సీస్ లోనూ 'అఖండ' మాస్ జాతర కొనసాగింది. విడుదలైన పది రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిన బాలయ్య సినిమా.. వందకు పైగా కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకొని దాదాపు 200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ క్రమంలో 2021లో తెలుగులో బిగ్గెస్ట్ ప్రాఫైటబుల్ చిత్రంగా.. బాలకృష్ణ - బోయపాటి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా 'అఖండ' రికార్డ్ క్రియేట్ చేసింది. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టడం గొప్ప విషయమనే చెప్పాలి.
థియేటర్లలో అఖండమైన విజయాన్ని సాధించిన ఈ యాక్షన్ అండ్ మాస్ మసాలా మూవీ.. ఇప్పుడు డిజిటల్ స్క్రీన్స్ మీద మాస్ జాతరకు రెడీ అయింది. ఈరోజు శుక్రవారం సాయంత్రం నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ+ హాట్ స్టార్ లో బ్లాక్ బస్టర్ ''అఖండ'' స్ట్రీమింగ్ అవుతోంది. ఖండ ఖండాల వసూళ్ల ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
కాగా, 'అఖండ' చిత్రంలో అఘోరాగా, మురళీకృష్ణగా ద్విపాత్రాభినయం చేసి బాలకృష్ణ నట విశ్వరూపం చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ అందించిన పాటలు మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించాయి. బోయపాటి టేకింగ్.. సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ.. సినిమాని యాక్షన్ పార్ట్ కూడా హైలైట్ అయ్యాయి.
'అఖండ' చిత్రాన్ని మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ - జగపతి బాబు - పూర్ణ - నితిన్ మెహతా - కాలకేయ ప్రభాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.