నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం `అఖండ`. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 2న విడుదలై వరల్డ్ వైడ్ గా అఖండ విజయాన్ని సాధిస్తూ కలెక్షన్ ల వర్షం కురిపిస్తోంది. కోవిడ్ తరువాత డీలాపడిన థియేటర్ లకు సరికొత్త ఊపునిచ్చింది.
చాలా కాలం తరువాత తిరుగులేని బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న బాలయ్య రెట్టించిన ఉత్సాహంతో వున్నారు. సినిమా విడుదలై వారం కావస్తున్నా `అఖండ` జోరు ఏమాత్రం తగ్గడం లేదు.
తమన్ మ్యూజిక్, బోయపాటి - బాలయ్యల మ్యాజిక్ వర్కవుట్ కావడంతో ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
ఈ నేపథ్యంలో సక్సెస్ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్న `అఖండ` టీమ్ గురువారం వైజాగ్‌లో విజయోత్సవ సభని ఏర్పాటు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి సింహాద్రి అప్పన్న స్వామిని సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ``అఖండ` సినిమా అఖండ విజయాన్ని సాధించిన సందర్భంగా వైజాగ్ లో విజయోత్సవ సభని ఏర్పాటు చేశాం. ముందుగా స్వామివారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చాం.
స్వామి వారి ఆశీస్సులు అందుకున్నాం, సంవత్సరం తొమ్మిది నెలల తరువాత విడుదలైన సినిమాకు ప్రేక్షకులు మంచి ఆదరణ చూపించారు. ఇది మా ఒక్కరి విజయమే కాదు ఇండస్ట్రీ విజయం. ఈ సినిమాతో ఇండస్ట్రీకి ధైర్యం వచ్చింది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు బాలకృష్ణ.