`అఖండ` ప్రీరిలీజ్ బిజినెస్.. టార్గెట్ పెద్ద‌దే!

Update: 2021-12-01 08:41 GMT
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన అఖండ భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబర్ 2 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య మ‌రోసారి మాస్ లో మ్యాసివ్ హిట్ అందుకుంటార‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 56 కోట్ల రేంజుకు చేరుకోగా.. నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ రూపంలోనూ భారీ మొత్తాల్ని కొల్ల‌గొడుతోంద‌ని స‌మాచారం.

థియేట్రిక‌ల్ బిజినెస్ ప‌రంగా బాలకృష్ణ కెరీర్ రెండవ బెస్ట్ అని తెలుస్తోంది. తక్కువ టిక్కెట్ రేట్లు కొంత స‌మ‌స్యాత్మ‌కం అయినా. థియేటర్లలో మరే ఇతర సినిమా ప్రదర్శించకపోవటం తో అఖండ‌ చిత్రాన్ని చాలా ఏరియాల్లో వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

గౌతమీపుత్ర శాత‌క‌ర్ణి రేంజులో భారీ ఓపెనింగుల ల‌క్ష్యంగా రిలీజ్ చేస్తున్నారు. డే-1లో 10కోట్ల రేంజులో వ‌సూలు చేయాల‌న్న ల‌క్ష్యం క‌నిపిస్తోంది. ప్రాంతాల వారీగా హక్కులు ఏరియా ప్రీ-రిలీజ్ బిజినెస్ ప‌రిశీలిస్తే నైజాం 12 కోట్లు- సీడెడ్ -12 కోట్లు.. ఆంధ్రా 25 కోట్ల రేంజులో బిజినెస్ సాగింది. ఏపీ తెలంగాణ క‌లుపుకుని 49కోట్ల మేర బిజినెస్ చేయ‌గా.. ఓవ‌ర్సీస్ లో 2.5కోట్ల మేర బిజినెస్ పూర్త‌యింది. ఓవ‌రాల్ గా 56కోట్ల రేంజులో ప‌లికింద‌ని తెలుస్తోంది. అంటే అఖండ‌.. సుమారు 70కోట్లు పైగా నెట్ వ‌సూలు చేయాల్సి ఉంటుంద‌న్న‌మాట‌.
Tags:    

Similar News