అఖిల్ హీరోగా చేసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా, ఈ నెల 15వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై అఖిల్ మాట్లాడుతూ .. "ఇలాంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. బన్నీవాసు .. వాసువర్మ .. 'బొమ్మరిల్లు' భాస్కర్ .. ఈ ముగ్గురితో కలిసి కూర్చుని కూర్చుని, కథను డెవలప్ చేసి చేసి అలా రెండున్నరేళ్ల ప్రయాణం తరువాత ఈ రోజున నేను ఇక్కడ నుంచున్నాను. గర్వంగా చెబుతున్నాను .. ఒక మంచి లవ్ స్టోరీ చేశానని అనుకుంటున్నాను.
బన్నీ వాసుకి కథపై ఉన్న గ్రిప్పులో కొంచెం నాకు ఉన్నా చాలనుకుంటాను. అన్ని క్రాఫ్టులపై బన్నీ వాసుకి మంచి పట్టుంది .. తాను అన్ని యాంగిల్స్ నుంచి ఆలోచిస్తాడు. ఒక సినిమాను కథ స్థాయి నుంచి ఫైనల్ స్టేజ్ కి ఎలా తీసుకెళ్లాలనేది ఆయనకి బాగా తెలుసు. వాసు వర్మతో కలిసి ఆయన ఒక వండర్ఫుల్ జర్నీ ఇచ్చాడు. 'బొమ్మరిల్లు' భాస్కర్ విషయానికి వస్తే ఆయన సినిమాలు చూసి చూసి ఉన్నాను. ఆయన రాసే విధానం అంటే నాకు విపరీతమైన ఇష్టం. ఆయనను చూడగానే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాడు. ఆయనతో నా జర్నీ చాలా బాగా కొనసాగింది.
గోపీసుందర్ చాలా చక్కని సంగీతాన్ని అందించాడు. ప్రతి పాట హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్ అవినాశ్ పనితీరు చాలా బాగుంది .. ఆయన మా హోమ్ బ్యానర్ ఆర్ట్ డైరెక్టర్ గా మారిపోయాడనిపిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక పూజ హెగ్డే చాలా బ్యూటిఫుల్ .. ఆమె హార్డ్ వర్క్ ను చాలా దగ్గరగా చూశాను. సినిమాకి .. సినిమాతో ఆమె కెరియర్ గ్రాఫ్ పెరుగుతుండటం గమనిస్తున్నాను.
అల్లు అరవింద్ గారూ .. మీ గురించి నేను ఏం చెప్పాలిప్పుడు. మన ఫ్యామిలీస్ మధ్య ఒక అన్ సెట్ ప్రామిస్ ఉంది. ఆ ప్రామిస్ డెలివర్ చేసి మనం ఇంకో ఈవెంట్ పెట్టుకుని మాట్లాడుకుందాం సార్. ఈ రోజున అంతవరకూ మాత్రమే చెప్పాలనుకున్నాను సార్. ఇక కోవిడ్ టైమ్ లో నాకు అనిపించింది .. ఏంటి ఈ కర్మ .. పరిగెత్తవలసిన సమయంలో ఆగిపోతున్నాం అనుకున్నాను. ఒక లాక్ డౌన్ తరువాత ఒక హోప్ వచ్చింది .. మరో లాక్ డౌన్ వచ్చి ఆ హోప్ ను తీసుకెళ్లిపోయింది. మళ్లీ మనకి ఈ కర్మ ఏంటి అనుకున్నాను.
సెకండ్ వేవ్ తరువాత 'లవ్ స్టోరీ'తో మళ్లీ ఒక హోప్ వచ్చింది. ఆ హోప్ ను నేను గట్టిగా పట్టుకుంటున్నాను. ఆ హోప్ ను పట్టుకునే ఈ నెల 15వ తేదీన వస్తున్నాం. మళ్లీ మంచి రోజులు వస్తాయి .. థియేటర్ల గతవైభావాన్ని చూస్తామనే నేను అనుకుంటున్నాను. మీరంతా మళ్లీ థియేటర్లకు రావాలి. ఇక ముందడుగు వేసే సమయం వచ్చింది. వెనకడుగు వేసే సమయం దాటిపోయింది. నా మీద అక్కినేని అభిమానులంతా ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నన్ను ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు. నేను ఒకటే చెబుతున్నాను .. మీ నమ్మకాన్ని నిలబెట్టేవరకూ నిద్రపోను. అప్పటివరకూ నాకు నిద్రరాదు .. నేను నిద్రపోలేను .. అది మాత్రం గుర్తు పెట్టుకోండి .. ఇది ఖాయం" అంటూ చెప్పుకొచ్చాడు.