యూత్ కింగ్ అఖిల్ అక్కినేని ప్రస్తుతం ''ఏజెంట్'' అనే స్పై థ్రిల్లర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ గూఢచారిగా కనిపించనున్నారు. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండగా.. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి అభిమానులను ఖుషీ చేసే ఓ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే ''ఏజెంట్'' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి సతీమణి ఇంస్టాగ్రామ్ చిట్ చాట్ లో ఈ విషయాన్ని వెల్లడించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. సూరి ఇంతకముందు డైరెక్ట్ చేసిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు అఖిల్ సినిమాని కూడా పలు ప్రధాన భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కథ కావడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ లో కీలక మార్పులు చేసి కొన్ని సీన్స్ రీషూట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోలందరూ నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకునేలా సినిమాలు చేస్తున్నారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అఖిల్.. ఇప్పుడు ''ఏజెంట్'' మూవీతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
'ఏజెంట్' సినిమా కోసం అక్కినేని హ్యాండ్సమ్ హీరో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇన్నాళ్ళూ లవర్ బాయ్ తరహా పాత్రలు చేసిన అఖిల్.. స్పై పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు. జిమ్ లో కఠినమైన వర్కౌట్స్ చేసి కండలు తిరిగిన దేహాన్ని రెడీ చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో అయ్యగారి ట్రాన్స్ఫర్మేషన్ కి అందరూ షాక్ అయ్యారు. తన సినిమాల్లో హీరోలను కొత్తగా చూపించే సూరి.. ఈసారి అఖిల్ ను కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు.
రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు సరెండర్2సినిమా బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అనిల్ సుంకర - సురేందర్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'ఏజెంట్' సినిమా వరల్డ్ క్లాస్ రేంజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్.. అఖిల్ యాక్షన్ - సురేందర్ స్టైల్ తో ప్రపంచ స్థాయి గూఢచారి సినిమాలతో సమానంగా ఉంటుందని నిర్మాత అనిల్ సుంకర ఆ మధ్య తెలిపారు.
ఈ స్పై క్రైమ్ థ్రిల్లర్ కు వక్కంతం వంశీ కథ అందించారు. దర్శక-రచయిత ద్వయం గతంలో 'కిక్' - 'ఊసరవెల్లి' - 'రేసుగుర్రం' వంటి సినిమాలకు కలిసి పనిచేశారు. హిప్ హాఫ్ తమిజ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రాగూల్ హెరియన్ ధారుమాన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ సినిమా తదుపరి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న 'ఏజెంట్'.. అఖిల్ మరియు సురేందర్ లకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.