వెర్సటైల్ స్టార్ శర్వానంద్ నటించిన 'ఒకే ఒక జీవితం' ఈ సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. శర్వానంద్ తల్లిగా అమల అక్కినేని నటించారు. ప్రమోషన్స్ లో భాగంగా అమ్మ చేతి వంట పేరుతో ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ను ప్లాన్ చేయగా.. ఇందులో అఖిల్ అక్కినేని కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఇంతకుముందు విడుదల చేశారు.
ఈ ప్రోమోలో అఖిల్ మాట్లాడిన విషయాలు ప్రజల హృదయాల్ని తాకాయి. డార్లింగ్ ప్రభాస్ మనసు గురించి అతడు అన్న మాటలు ఆసక్తిని కలిగించాయి. ప్రభాస్ ఆహార ప్రియుడని తాను విన్నానని అమల అన్నారు.
దీనిపై శర్వానంద్ వెంటనే స్పందిస్తూ ప్రభాస్ పెద్ద భోజన ప్రియుడని అన్నారు. ఆతిథ్యం విషయంలో కానీ ఇతరులపై ప్రేమాప్యాయతలతో మాట్లాడే విషయంలో కానీ ప్రభాస్ ఎవరినీ అంత తేలికగా వదిలిపెట్టడని అఖిల్ దానిని సమర్థించారు. తన తల్లి గారు అమల ఎదుట చాలా జాగ్రత్తగా ఉంటానని కూడా అఖిల్ అన్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో రేపు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది.
తెలుగు- తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు- ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.
ఇటీవలకార్తీ నటించిన మారిపోయే ప్రమోషనల్ సాంగ్ విడుదలై ఆకట్టుకుంది. ఈ పాటలో కనిపించడమే కాకుండా కార్తీ తెలుగులో తన మొదటి పాటతో గాయకుడిగా ఆరంగేట్రం చేసాడు. టైటిల్ కి తగ్గట్టుగానే సమయం గడిచేకొద్దీ ప్రతిదీ ఎలా మారుతుందో పాటలో చెప్పిన తీరు మూవీ థీమ్ ని ఆవిష్కరించింది. వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ రచయిత -దర్శకుడిగా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఒకే ఒక జీవితం టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా. శర్వా కొన్ని ఫ్లాపుల తర్వాత ఒక బంపర్ హిట్ కోసం వేచి చూస్తున్నాడు. కంబ్యాక్ ఇప్పుడు అతడికి చాలా అవసరం. దీనికోసం అతడు చాలా కాలం పాటు వేచి చూసాడు. శర్వా ఆశించిన హిట్టు వస్తుందా లేదా? టైమ్ ట్రావెల్ నేపథ్యంలోని కథతో అతడి ప్రయత్నం ఏ మేరకు ఆడియెన్ కి కనెక్టవుతుంది అన్నది వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View