ఏంటి.. అఖిల్‌ కొత్తది కొనేశాడా??

Update: 2016-01-08 15:03 GMT
ఇప్పటికే మెర్సిడీస్‌ బెంజ్‌ ఎస్‌ క్లాస్‌ లో తిరుగుతంటాడు అక్కినేని అఖిల్‌. బార్న్‌ విత్‌ గోల్డెన్‌ స్పూన్‌ కాబట్టి.. కార్లకు పెద్దగా లోటేం ఉంటుంది చెప్పండి. అందుకే ఇప్పుడు మరో కొత్త కార్‌ తీశాడు అఖిల్‌. అయితే ఈ కారుకు ఓ ప్రత్యేకత ఉంది.

తొలి సినిమాతో ఘోరంగా విఫలం అయినా కూడా.. లుక్స్‌ పరంగా మనోడు బాగా ఆకట్టుకోవడంతో.. విపరీతంగా ఎండార్స్‌ మెంట్‌ క్యాంపెయిన్లు చేస్తున్నాడు. టైటాన్‌ వాచ్‌ యాడ్‌.. మౌంటేన్‌ డ్యూ యాడ్‌.. అలాగే సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ కు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా.. బ్యాంబినో వారికి బ్రాండింగ్‌ బాబులా.. చాలానే చేశాడు. మరి వాటిలో ఎంత సంపాదించాడో తెలియదు కాని.. ఇప్పుడు మెర్సిడెస్‌ బెంజ్‌ జి క్లాస్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌.యు.వి) ఒకటి కొన్నాడు. పాత మోడల్‌ బొలెరో జీపు టైపులో ఉండే ఆ క్రాస్‌ కంట్రీ వెహికల్‌ధర.. ఆన్‌ రోడ్‌ షుమారు 2.5 కోట్లు. ఈ కారు రేంజ్‌ రోవర్‌, డిస్కవరీ తదితర మోడళ్లకు ఈక్వెలెంట్‌. ఈరోజు సదరు కారుతో మనోడు జర్నలిస్టుల కంట పడ్డాడులే.

అయితే చేసిన నాలుగు యాడ్లకే అఖిల్‌ అంత సంపాదించి ఈ కారును కొనేశాడా అంటూ ఇప్పుడు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. డబ్బులు సంపాదించడం కాదు.. దాచుకోవడం కూడా ఒక ఆర్టే మరి.
Tags:    

Similar News