అక్కినేని ప్రిన్స్ అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం వైజాగ్ లో చిత్రీకరణ జరుగుతోంది. వైజాగ్ లో చిత్రీకరణ కోసం వెళ్లిన అఖిల్ కు అక్కడి అక్కినేని అభిమానులు ఓ రేంజ్ లో ఆహ్వానం పలికారు.
భారీగా ర్యాలీ నిర్వహించి మరీ అఖిల్ కు ఆహ్వానం పలకడంతో సందడి వాతావరణం నెలకొంది. షూటింగ్ కార్యక్రమాల విషయానికి వస్తే ప్రస్తుతం వైజాగ్ లో అఖిల్ ఏజెంట్ సినిమాను నైట్ నైట్ చిత్రీకరిస్తున్నారు. నైట్ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ నిర్వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న అఖిల్ సినిమా ఏజెంట్ పై అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
సురేందర్ రెడ్డి గత చిత్రం సైరా నరసింహా రెడ్డి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి పలు కథలను రెడీ చేసుకుని చివరకు అఖిల్ తో సినిమాకు సిద్దం అయ్యాడు. అఖిల్ తో మూవీ కోసం సురేందర్ రెడ్డి ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
అఖిల్ హీరోగా ఒక బాండ్ రేంజ్ సినిమాను సురేందర్ రెడ్డి చాలా స్టైలిష్ గా రూపొందిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. తాజాగా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో సినిమాను అనుకున్న తేదీకి.. సమయంకు విడుదల చేసే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఆయన తెలుగు లో నటించిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాయి అనే సెంటిమెంట్ ఉంది. కనుక ఈ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో అక్కినేని అభిమానులు ఉన్నారు. ఆగస్టులో సినిమా విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తోంది.