అఖిల్‌5 వెయిట్‌ పెంచేస్తున్న సూరి

Update: 2021-01-16 17:30 GMT
అక్కినేని అఖిల్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో సినిమా అధికారికంగా ప్రకటన వచ్చి నెలలు గడుస్తుంది. అయినా ఇప్పటి వరకు సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వలేదు. అఖిల్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమా విషయంలో చర్చలు జరుగుతున్నాయి. అఖిల్ అక్కినేని ప్రస్తుతం చేస్తున్న బ్యాచిలర్‌ పనులు పూర్తి అవ్వడమే ఆలస్యం సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ కంప్లీట్‌ అయ్యింది. ఇక ఈ సినిమా కోసం తమిళ మరియు మలయాళ స్టార్‌ లను రంగంలోకి దించేందుకు సురేందర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్‌ 5 కోసం మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్ లాల్‌ మరియు తమిళ స్టార్‌ నటుడు అరవింద స్వామిని సురేందర్ రెడ్డి సంప్రదిస్తున్నాడట. ఇప్పటికే అరవింద స్వామితో 'ధృవ' సినిమాకు సురేందర్ రెడ్డి వర్క్‌ చేశాడు. కనుక ఇద్దరి మద్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగానే అఖిల్‌ 5 లో అరవింద్ స్వామి నటించే అవకాశం ఉంది. ఇక మోహన్ లాల్‌ ఇటీవల టాలీవుడ్‌ స్క్రీన్ పై నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు.

స్టైలిష్‌ డైరెక్టర్‌ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ అవ్వడం వల్ల సూరితో నటించేందుకు మోహన్‌ లాల్‌ కూడా ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఖచ్చితంగా వీరిద్దరు అఖిల్‌ 5 లో ఉంటారని.. తద్వారా అఖిల్‌ మూవీ వెయిట్‌ అమాంతం పెరగడం ఖాయం అంచనాలు పీక్స్‌ కు వెళ్లడం ఖాయం అంటూ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News