అక్కినేని హీరోల్లో ఏఎన్నార్ తర్వాత నాగార్జున ఆ ట్రాక్‌ను సమర్ధవంతం గా కొనసాగించారు. నటవారసుడుగా వచ్చిన కింగ్ ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకుల్ని మెప్పించారు. అయితే ఇంతకాలం నాగార్జున మార్కెట్ రేంజ్ కేవలం 40కోట్ల లోపే. అదీ మనం సినిమాతోనే ఆ మార్క్ ను అందుకున్నాడు. అయితే ఇతర స్లార్ హీరోలంతా 50కోట్ల పైబడిన మార్కెట్ తో టాలీవుడ్‌లో దూసుకుపోవడం అక్కినేని నాగార్జున ముందున్న సవాల్.
ఇప్పటికే నాగార్జున హవా అనుకున్న స్థాయికి చేరుకోలేదు. అతడు నమ్ముకున్న చైతన్య మాస్ హీరోగా అనుకున్న స్థాయికి ఎదగలేకపోయాడు. అందుకే తన ముందు ఉన్న సవాల్‌ని ఎదుర్కోవడానికి అఖిల్ అనే బ్రహ్మాస్ర్తాన్ని ప్రయోగిస్తున్నాడు. తనకి, చైతన్యకి అచ్చిరాని యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలు అఖిల్ కి కలిసొస్తాయని నాగ్ భావిస్తున్నారు. అందుకే అఖిల్ ను మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతిలో పెట్టాడు. గాల్లోకి సుమోలు లేపినా, గుక్క తిప్పుకోని యాక్షన్ ని చూపించినా వినాయక్ కే సాధ్యం. అందుకే తొలి సినిమాతోనే అఖిల్ ని మాస్ ఇమేజ్ ఉన్న హీరోని చేసేందుకు తహతహలాడారు. అఖిల్ మొదటి సినిమాపై భారీ బెట్టింగ్ సాగింది. రిలీజ్‌కి ముందే 45కోట్ల బిజినెస్ చేసి ఔరా అనిపించాడు.
ఇక అఖిల్ రెండవ సినిమా కూడా మిసైల్ స్పీడ్ తో దూసుకుపోవాలంటే మాస్ డైరెక్టరే కావాలి. అందుకే 100 కోట్ల క్లబ్ దర్శకుడు కొరటాల శివతో నాగార్జున అఖిల్ రెండవ సినిమా విషయంపై చర్చలు జరుపుతున్నారని తెలిసింది. శివ కూడా తొలి సినిమా మిర్చితో ప్రభాస్ ని క్లాస్ విత్ మాస్ స్టయిల్‌లో ఆవిష్కరించి టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల శ్రీమంతుడు విజయంతో శివ పేరు మరోసారి మారు మ్రోగిపోయింది. ఇందులో హీరోగా నటించిన మహేష్ బాబును క్లాస్ గా చూపిస్తునే అవసరమైనప్పుడు మాస్ గాను చూపించి బాక్సాఫీస్ వద్ద కోట్ల వసూళ్లను కొల్లగొట్టిన దర్శకుడయ్యాడు. శివ చేతిలో అఖిల్ పడితే రెండవ సినిమాతోనే స్టార్ హీరోల జాబితాలో చేరిపోతాడని కింగ్ ప్లాన్ చేస్తున్నారు. నిర్మాతలు ఎలానూ క్యూలో ఉంటారు కాబట్టి అఖిల్ రెండో సినిమా బెట్టింగ్ కి ఢోఖా లేనేలేదు. అయితే ఈ వరుసలో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇటీవలే ఆ ప్రోడ్యూసర్ కి అఖిల్ డేట్లు కూడా ఇచ్చేశాడని అంటున్నారు. ఈ లెక్కల్ని బట్టి అఖిల్ మొదటి సినిమాతోనే 50కోట్ల హీరోగా రికార్డులు సృష్టిస్తే మాస్ హీరోగా గుర్తింపు పొందినట్టే. నాగార్జున ప్రయోగించిన మిసైల్ వర్కవుటయినట్టే. ఇక టార్గెట్ 100కోట్లే.