ఇటలీలో అఖిల్ డెస్టినేషన్ వెడ్డింగ్??

Update: 2016-11-01 07:23 GMT
ఆల్రెడీ ఫ్యాషన్ డిజైనర్ శ్రీయ భూపాల్ తో అక్కినేని అఖిల్ ప్రేమలో ఉన్నాడనే విషయం మనకు తెలిసిందే. అయితే డాడ్ నాగార్జున తన చిన్నకొడుకు పెళ్లిని చాలా సింపుల్ గా చేసేద్దాం అనుకుంటే.. ఇప్పుడు మాత్రం అవతల శ్రీయ ఫ్యామిలీ జివికె అండ్ సోమ్ భూపాల్ లకు చెందిన బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి.. వారు అత్యంత గ్రాండ్ గా చేద్దాం అని ఫిక్సయ్యారట.

ఈరోజు టైమ్స ఆఫ్ ఇండియా వారు అందించిన వార్త ప్రకారం.. అఖిల్ మరియు శ్రీయ భూపాల్ పెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్ అని తెలుస్తోంది. అది కూడానూ ఇటలీ దేశంలో చేస్తున్నారట. ఇప్పటికే ఇటలీలో నేపుల్స్ అలాగే రోమ్ నగరాల్లో అనువైన ప్రదేశాలను వెడ్డింగ్ కోసం వెతకగా.. అందులో ఒక వెన్యూ ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. బహుశా 2017 తొలి భాగంలో జరిగే ఈ పెళ్లి కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 గెస్టులు వస్తారని తెలుస్తోంది. వారందరికీ సెవెన్-స్టార్ ఆతిధ్యంతో పాటు.. ఇటలీలో నాలుగురోజుల పాటు గ్రాండ్ రిసప్షన్ హోస్ట చేయనున్నారు.

ఇకపోతే పెళ్ళి ఇటలీలో అంటే.. మరి నాగార్జున ఫిలిం ఇండస్ర్టీ కోసం హైదరాబాద్ లో రిసప్షన్ ఏర్పాటు చేస్తారేమో చూడాలి. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News