అఖిల్ బడ్జెట్ మళ్లీ ఆకాశంలోనే!!

Update: 2017-03-13 09:47 GMT
అక్కినేని అఖిల్ రెండో సినిమా త్వరలో పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే టైటిల్ కూడా డిసైడ్ అయిపోయందని టాక్. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ రిజిస్టర్ చేయించిన రారండోయ్ వేడుక చూద్దాం టైటిల్ ను అఖిల్ కోసమే రిజిస్టర్ చేయించారని చెప్పచ్చు.

ఇప్పుడీ మూవీకి 40 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారనే న్యూస్ హాట్ టాపిక్ అయిపోయింది. సహజంగా విక్రమ్ కె కుమార్ సినిమాలన్నీ  కనీసం  ఈ స్థాయిలోనే ఉంటాయి. అయితే.. ఎక్కువకాలం తీయడం కూడా కొన్ని సార్లు బడ్జెట్ పెంచేస్తూ ఉంటుంది. కానీ ఈయన పర్ఫెక్షనిజంపై అందరికీ నమ్మకం ఎక్కువ. పైగా ఒకసారి టచ్ చేసిన జోనర్ ను మరోసారి టచ్ చేయకుండా సినిమాలు తీస్తుంటాడు విక్రమ్. ఇప్పుడు అఖిల్ తో చేయనున్న మూవీని హాలీవుడ్ యాక్షన్ రేంజ్ లో ప్లాన్ చేశారట.

అందుకే బడ్జెట్ భారీగా అవసరమైందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఫైట్ల కోసమే 20 కోట్లు కేటాయిస్తున్నారని తెలుస్తోంది. అఖిల్ తొలి మూవీ అఖిల్ ను కూడా ఈ స్థాయిలోనే తీశారు. కానీ ఫలితం నిరుత్సాహపరిచింది. కానీ తనకు మనం వంటి మూవీని అందించిన విక్రమ్ కె కుమార్ పై ఉన్న అపారమైన నమ్మకంతో ఇంత బడ్జెట్ కేటాయించాడట నాగార్జున.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News