అక్కినేని అఖిల్ డెబ్యూ సినిమా టైటిల్ ఏంటి? ప్రస్తుతం ఇంటా బైటా ఇదో ఆసక్తికర చర్చ. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భమిది. ఒక సినిమా విజయం వెనక టైటిల్ ప్రభావం అసాధారణం అని సినిమా హిస్టరీ చెబుతోంది. టైటిల్ తోనే సగం జనాల్ని థియేటర్ కు లాక్కెళ్లే ఛాన్సుందని ట్రేడ్ పండితులు చెబుతుంటారు. ఆ లెక్కకు తగ్గట్టే అఖిల్ టైటిల్ ని నిర్ణయిస్తారా లేదా? అంతా సస్పెన్స్!!
ఫిలింనగర్ టాక్ ప్రకారం.. ప్రస్తుతం ఈ సినిమాకి మిసైల్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్ అయితేనే అత్యంత ప్రభావవంతంగా, పవర్ ఫుల్ గా ఉంటుందని వినాయక్ అండ్ టీమ్ భావిస్తున్నారు. ప్రభాస్ మిర్చి సినిమాలో పాపులర్ సాంగ్ 'మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే .. మిసైల్ లా దూసుకొస్తాడే... ' అనే లిరిక్ నుంచి మిసైల్ అనే పదాన్ని టైటిల్ గా ఎంపిక చేసుకుంటే యువతరంలోకి సూటిగా దూసుకెళ్లినట్టు అవుతుందని భావిస్తున్నారు.
అయితే ఈ టైటిల్ విషయంలో నాగార్జున భావన వేరుగా ఉంది. ఈ టైటిల్ మ్యాకో తరహాలో ఉంది. దీనికంటే ఏదైనా సాఫ్ట్ టైటిల్ అయితేనే బావుంటుందనేది అతడి ఆలోచన. అందుకే బాలరాజు అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నారు. ఇదో పాత క్లాసిక్ టైటిల్ లా అనిపించినా దీనివల్ల కొంత పాజిటివ్ ప్రభావం ఉంటుందని చిత్రయూనిట్ భావిస్తోంది. త్వరలోనే అధికారికంగా ఈ సోషియో ఫాంటసీ సినిమాకి టైటిల్ ని ప్రకటిస్తారేమో చూడాలి.