మంచు వారబ్బాయికి అక్కినేని కుర్రాడి షాక్

Update: 2016-06-05 09:45 GMT
తోటి హీరోల పుట్టిన రోజును గుర్తుంచుకుని సోషల్ మీడియాలో ఓ విష్ పెట్టేయడం అన్నది చాలా సింపుల్ విషయం. ఈ పని ఎవ్వరైనా చేసేస్తారు. కానీ ఓ హీరో వివాహ వార్షికోత్సవాన్ని గుర్తు పెట్టుకుని.. ఆ రోజు వాళ్లింటికి వెళ్లి వాళ్లకో ఖరీదైన బహుమతి ఇస్తే అవతలి వాళ్లు కచ్చితంగా షాకవుతారు. అక్కినేని అఖిల్.. మంచు మనోజ్ కు అలాంటి షాకే ఇచ్చాడు. గత ఏడాది మనోజ్ తన బ్యాచిలర్ లైఫ్ కు శుభం కార్డు వేసేసి.. ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే యానివర్శరీ కూడా ఘనంగా జరుపుకున్నారు మనోజ్-ప్రణతి. ఐతే ఆ రోజు అఖిల్ నుంచి వీళ్లిద్దరికీ ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది. అలస్కాన్ మాలమ్యూట్ జాతికి చెందిన నీలి కళ్ల అందమైన పప్పీ వాళ్లింటికి చేరింది. అఖిల్ తమ వివాహ వార్షికోత్సవాన్ని గుర్తు పెట్టుకోవడమే కాక.. ఇలా చక్కటి బహుమతి కూడా ఇవ్వడంతో మనోజ్-ప్రణతి చాలా సంతోషించారు. ఈ కుక్కపిల్లకు జోయా అని పేరు కూడా పెట్టారు. ఈ సంగతి సోషల్ మీడియాలో కూడా పంచుకున్నాడు మనోజ్.

‘‘మా కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చారు. అందరూ జోయాకు వెల్ కమ్ చెప్పండి. మా వివాహ వార్షికోత్సవానికి ఈ బహుమతి ఇచ్చిన అక్కినేని అఖిల్ కు థ్యాంక్స్. ఇది నీలి రంగు కళ్లున్న అలస్కాన్ మాలమ్యూట్ జాతి పప్పీ’’ అని మనోజ్ వెల్లడించాడు. అఖిల్ మనోజ్ మీద చూపించిన ప్రేమ చాలామంది ఆశ్చర్యపోయారు. అఖిల్ డాగ్ లవర్ అని.. అతడి తల్లి అమల మూగజీవాల కోసం పోరాడుతుందని అందరికీ తెలిసిందే.
Tags:    

Similar News