అనసూయ బుల్లితెర మీద ‘ఎ డేట్ విత్ అనసూయ’ అంటూ ఓ కొత్త ప్రోగ్రాం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ షోకు అతిథిగా వచ్చాడు అఖిల్ అక్కినేని. ఈ షోలో వ్యక్తిగత.. సినీ విషయాలు చాలా పంచుకున్నాడు అఖిల్. ఈ షో కోసం వచ్చిన అఖిల్ కొంచెం గడ్డంతో కనిపించాడు. ఈ లుక్ ప్రస్తావన వచ్చినపుడు స్పందిస్తూ.. తాను చేయబోయే కొత్త సినిమా డైరెక్టర్ తనకు ఓ లుక్ సజెస్ట్ చేశాడని.. దాని కోసం నెలా రెండు నెలలు శ్రద్ధ పెట్టబోతున్నానని చెప్పాడు. ఐతే ఆ డైరెక్టర్ పేరు చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు. మొన్నటిదాకా హను రాఘవపూడితో అఖిల్ రెండో సినిమా కన్ఫమ్ అనుకుంటూ ఉండగా.. ఇప్పుడేమో ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఈ పరిణామాలు జరక్కముందే ఇంటర్వ్యూ జరిగిందో ఏమో తెలియదు మరి. మొత్తానికి అఖిల్ ను లుక్ మార్చుకోమన్నది హనుయేనా.. మరి అఖిల్ ఆ సినిమా చేస్తున్నాడా లేదా అన్నది క్లారిటీ లేదు.
ఇక తాను సినిమాల్లోకి రాబోయే ముందు ఇంట్లో జరిగిన పరిణామాల గురించి స్పందిస్తూ.. ‘‘ఇంటర్మీడియట్ అయ్యాక బీబీఏ చేద్దామని వెళ్లా. కానీ అక్కడికి వెళ్లాక నా పాథ్ ఇది కాదని అనిపించింది. అందుకే నాన్నను అడిగి ఏడాది టైం తీసుకుని సినిమాల కోసం సన్నద్ధమవుతానని చెప్పాను. ఆ ఏడాది పూర్తయ్యాక కూడా నా గమ్యం సినిమాల వైపే ఉంటే ఇందులోనే కంటిన్యూ అవుతానని.. లేదంటే ఏదైనా కోర్సు చేస్తానని చెప్పా. ఏడాది గడిచాక సినిమాలే కెరీర్ అని భావించి యాక్టింక్ కోర్సు చేయడానికి రెడీ అయ్యాను’’ అన్నాడు. ‘సిసింద్రీ’ సినిమా జనాలకు ఎంత ఆనందాన్నిచ్చిందో కానీ.. ఆ సినిమా చేయడం వల్ల వందల మందితో బుగ్గలు గిల్లించుకుని తాను చాలా ఇబ్బంది పడ్డానని అఖిల్ వ్యాఖ్యానించాడు.