అక్కినేని వంశం నుంచి మూడో తరం సూపర్ స్టార్ దూసుకొస్తున్నాడు. అక్కినేని అఖిల్ హీరోగా వినాయక్ దర్శకత్వం వహించిన అఖిల్ చిత్రం దసరా కానుకగా ఈనెల 22న రిలీజవుతోంది. ఈ సందర్భంగా అక్కినేని హీరో కాస్త నెర్వస్ గానే ఫీలవుతున్నాడు. తన మొదటి సినిమా ఒత్తిడి తనపై ఉందనే చెబుతున్నాడు. రిస్కెందుకనే సేఫ్ బెట్ ఆలోచించానని వినమ్రంగా చెబుతున్న అఖిల్.. ఇంకా చాలా సంగతులే చెప్పాడు.
అఖిల్ చిత్రం రిలీజ్ కి వచ్చేస్తోంది... అక్కినేని లెగసీని కొనసాగించే ప్రయత్నంలో తొలి అడుగు వేస్తున్నట్టే భావించాలా?
చాలా నెర్వస్ గా ఉంది. భారీ అంచనాలతో ఆడియెన్ థియేటర్ కి వస్తున్నారు. హైప్ క్రియేటైంది. బిజ్ బావుంది. అదే నాలో ఆందోళన పెంచుతోంది. అల్టిమేట్ గా సినిమా విజయాన్ని నిర్ణయించేది కంటెంట్. జనాలకు అది నచ్చితే విజయం సాధ్యమే.
ఫ్యామిలీ సపోర్ట్ అన్నిటినీ అందిస్తుందా?
ఆరంగేట్రం వరకూ ఓకే. స్టార్స్ ఉన్న ఫ్యామిలీ నుంచి ప్రవేశం సులువే. అయితే ఇది పెద్ద బాధ్యత. మూడో తరం హీరోగా లెగసీని కాపాడే బాధ్యత నాపై ఉంది. అది నాలో భయాన్ని పెంచుతోంది. అదే జాగ్రత్త నేర్పిస్తుంది. మా ఫ్యామిలీ హీరోల్లో మిగతావారికంటే బాగా నటించి చూపించాల్సిందే. ఎంతో హార్డ్ గా శ్రమిస్తే కానీ ఇది సాధ్యం కాదని అర్థమైంది.
క్రికెట్ లో స్టార్ కదా.. హీరో అవుతారని ఎవరూ ఊహించలేదు.. !
కుటుంబం అంతా స్టార్ లే. అలాంటప్పుడు అది వదిలేసి వేరే వైపు వెళతానని ఎలా అనుకుంటారు. నటన మా ఫ్యామిలీలోనే ఉంది కాబట్టి అది విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎంతో మంది కలగనేది.. నాకు నా ఫ్యామిలీ ద్వారా సులువుగా దక్కింది. అయితే క్రికెట్ నా హృదయానికి దగ్గరగా ఉండే ఆట. ఎంతో ప్రేమిస్తాను. ఇప్పటికీ స్నేహితులతో క్రికెట్ గురించి చర్చిస్తా. సెలబ్రిటీ క్రికెట్ ని కొనసాగిస్తాను. ప్రతియేటా ఆడుతాను. క్రికెట్ నా జీవితంలో భాగం మాత్రమే.
యాక్టింగ్ నేపథ్యం నుంచే వస్తున్నారు కాబట్టి నటన సులువే అనుకుంటున్నారా?
నటన చేతకాకపోతే పనవ్వదు ఇక్కడ. ఫ్యామిలీ ఎంట్రీ లెవల్ వరకే. ఆ తర్వాత నిరూపించుకుని ముందుకు సాగాల్సిందే. జనాలకు హీరో నచ్చకపోతే దూరం పెట్టేస్తున్నారు. స్టార్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారా? అన్నది చూడడం లేదు. అందుకే ఎవరైనా రేసులో నిరూపించుకోవాల్సిందే.
యాక్టర్ అవుతాను అనగానే ఏం చేశారు?
15 వయసులోనే హీరో అవ్వాలని క్లారిటీ వచ్చింది. ఆ వెంటనే నటనలో తర్ఫీదు పొందాను. డ్యాన్సులు - ఫైట్స్ లో శిక్షణ పొందాను. దానికోసం థాయ్ ల్యాండ్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. లాస్ ఏంజిల్స్ లో నటన - డ్యాన్సులు ప్రతిదీ శిక్షణ తీసుకున్నా.
కమర్షియల్ సినిమాతోనే ఎంట్రీ ఇవ్వడానికి కారణం?
ప్రయోగాలు చేయలేక కాదు. నాకు నచ్చే జోనర్ లో సినిమా చేయగలను. కానీ తెలుగు ప్రేక్షకులకు ఏం కావాలో అది ఇవ్వాలి. పైగా అభిమానుల అంచనాలకు తగ్గట్టు కనిపించాలి. పాటలు - ఫైట్స్ అన్నిటా కమర్షియాలిటీ అవసరం. లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్ లు ఇష్టపడతారు. అందుకు తగ్గట్టే సేఫ్ కమర్షియల్ సినిమాలో నటించాను. వినాయక్ ఈ చిత్రాన్ని సోల్ తో తెరకెక్కించారు. ఒక స్టార్ నుంచి ప్రేక్షకాభిమానులు ఏం కోరుకుంటారో అదే ఈ సినిమాతో ఇస్తున్నా.