కోహ్లీ బ‌యోపిక్‌ లో అఖిల్‌?

Update: 2018-10-10 14:17 GMT
అక్కినేని మిసైల్ అఖిల్ .. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని క‌లిసాడు. ఇంత‌కీ ఎందుకీ మీటింగ్ అంటారా?  క‌చ్ఛితంగా అది బిలియ‌న్ డాల‌ర్ బిజినెస్‌ కి సంబంధించిన వ్య‌వ‌హార‌మే అయ్యి ఉంటుంద‌ని సందేహం క‌లిగిందా?  ఎస్‌.. మీ గెస్ క‌రెక్టే. ఆ ఇద్ద‌రూ క‌లిస్తే ఇంకేం ఉంటుంది.. క‌చ్ఛితంగా ఏదైనా వాణిజ్య ప్ర‌క‌ట‌న రూపొందించే ప్ర‌య‌త్న‌మేన‌ని ఇట్టే చెప్పొయొచ్చు. యాథృచ్ఛికంగానే అఖిల్‌ కి క్రికెట్ అంటే పిచ్చి. ఆట‌లోనూ ప్రావీణ్యం  ఉంది. అందుకే ఆ క‌ల‌యిక అంతే నేచుర‌ల్‌ గా సెట్ట‌య్యింద‌ని చెప్పొచ్చు.

టాలీవుడ్‌ లో సూప‌ర్‌ స్టార్ మ‌హేష్ త‌ర్వాత అంత‌టి క‌రిష్మా .. స్మార్ట్ అప్పియ‌రెన్స్ ఉన్న హీరోగా అఖిల్‌ కి ఐడెంటిటీ ఉంది. అందుకే అత‌డి వెంట కార్పొరెట్ కంపెనీల‌న్నీ క్యూ క‌డుతున్నాయి. అఖిల్ - హ‌లో .. న‌టించిన ఈ రెండు చిత్రాల‌తో న‌టుడిగా ఫ్లెక్సిబిలిటీ అంద‌రికీ న‌చ్చింది. డ్యాన్సులు - ఫైట్స్‌ లోనూ అఖిల్ అప్పియ‌రెన్స్ అభిమానుల‌కు న‌చ్చింది. ఆ క్ర‌మంలోనే యూత్‌ లో ఫాలోయింగ్ పెరిగింది. సినిమా జ‌యాప‌జ‌యాల మాట ఎలా ఉన్నా.. అఖిల్ క్రేజు మాత్రం ఒక స్టార్ హీరోకి ఏమాత్రం త‌క్కువ కాదు. ఇక అక్కినేని హీరోగా అత‌డికి ముంబై లెవ‌ల్లో ఉన్న పీఆర్‌ కాంటాక్టులు బిలియ‌న్ డాల‌ర్ వాణిజ్య ప్ర‌పంచంలో సునాయాసంగా అవ‌కాశాలు అందుకునేలా చేస్తున్నాయి.

ఇంత‌కీ ఈ ఇద్ద‌రూ క‌లిసి ఏ ప్ర‌క‌ట‌న‌లో న‌టిస్తున్నారు? అన్న‌ది అటుంచితే.. కోహ్లీ ఆట కోసం వ‌చ్చి అన్నపూర్ణ స్టూడియోస్‌ లో ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో న‌టించారు. ఆ టైమ్‌ లో అఖిల్ అత‌డిని క‌లిశార‌ట‌. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో అక్కినేని అఖిల్ కలిసి సరదాగా మాచ్చటిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేడి పెంచుతున్నాయి. ఐపీఎల్‌లో ఆయ‌న అద‌ర‌గొడితే - సీసీఎల్‌ లో ఈయ‌న అద‌ర‌గొడ‌తాడు. మొత్తానికి కాంబో బాగానే కుదిరింది. క‌లిసి ఓ సినిమాలో కూడా న‌టిస్తే బావుంటుందేమో!! అన్న‌ట్టు ఇండియ‌న్ క్రికెట్ హిస్ట‌రీలో క‌పిల్‌ దేవ్‌ - ఎం.ఎస్‌.ధోని త‌ర్వాత బెస్ట్ కెప్టెన్‌గా వెలిగిపోతున్నాడు కోహ్లీ. అత‌డి జీవిత‌చ‌రిత్ర‌లో అఖిల్ న‌టిస్తాడేమో?

Tags:    

Similar News