అక్కినేని వారసుడు అఖిల్ పై అంచనాలు చాలానే ఉన్నా.. అవన్నీ పట్టాలు తప్పేశాయి. హీరోల లాంఛింగ్ సమయంలో సాధారణంగా ఎక్స్ పెక్టేషన్ రీచ్ కావడం కష్టమే. అయితే.. మరీ మూవీని జనాలు తిరస్కరించిన సందర్భాలు మాత్రం తక్కువగానే ఉంటాయి.
అఖిల్ మూవీకి మొదటి రోజున స్టార్ హీరోల స్థాయిలో దాదాపు 10 కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయంటే.. అఖిల్ కోసం, ఈ మూవీ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూశారనే విషయం అర్ధమవుతుంది. కానీ ఫ్యాన్స్ అంచనాలని అందుకోలేకపోవడం - కంటెంట్ లో కొత్తదనం లేకపోవడం - నాసిరకం గ్రాఫిక్స్ - ప్లాన్డ్ గా పండుగ రోజున విడుదల చేసినా వారం మధ్యలో కావడం.. అన్నీ కలిపి అఖిల్ కలెక్షన్స్ కి దెబ్బ కొట్టేశాయి. తొలి వీకెండ్ ముగిసే సమయానికి అఖిల్ వసూళ్లు 16 కోట్ల 34 లక్షలు మాత్రమే. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 14 కోట్ల 61 కోట్లు వసూలయ్యాయి.
మిగతా వాటిలో చెప్పుకోదగ్గది కర్నాటక మార్కెట్. ఇక్కడో కోటి 5 లక్షలు వచ్చాయి. అఖిల్ అమెరికా వెళ్లి ప్రచారం చేసొచ్చినా.. అక్కడి మార్కెట్ నుంచి కేవలం 33 లక్షలే వచ్చాయి. మిగిలిన ఏరియాల్లో కూడా పరిస్థితి దారుణంగానే ఉంది. పెట్టిన పెట్టుబడిలో సగంకంటే ఎక్కువే లాస్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. యూఎస్ లో అయితే 90శాతానికి నీళ్లు వదులుకోవల్సిందే. మొత్తానికి ఇప్పటికి 16 కోట్లు వచ్చినా.. ఇకపై కూడా పుంజుకునే అవకాశం లేకపోవడంతో.. మహా వస్తే మరో 3-4 వస్తాయంటున్నారు.