ఈపాటికి అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ సత్తా ఏంటో తేలిపోవాల్సింది. కానీ అనివార్య కారణాలతో దసరా రేసు నుంచి తప్పుకుంది ‘అఖిల్’. ఇప్పుడిక కొత్త డేటు విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. దసరా పోతే పోయింది దీపావళికైనా సినిమా వస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు అక్కినేని అభిమానులు. ‘అఖిల్’ టీమ్ కూడా దీపావళి విడుదలకే రెడీ అవుతున్నట్లు సమాచారం. కాకపోతే దీపావళికి క్రౌడ్ ఎక్కువుండటం పట్ల కొంచెం ఆందోళన చెందుతున్నారు. అన్నింట్లోకి ‘అఖిల్’ సినిమాకే క్రేజ్ ఎక్కువైనప్పటికీ.. ఛాన్స్ తీసుకోవద్దని ఆలోచిస్తున్నారట.
దీపావళికి రాబోతున్న మాస్ మసలా సినిమా ‘బెంగాల్ టైగర్’ను కొంచెం వెనక్కి పంపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. రెండు రోజులుగా బెంగాల్ టైగర్ వాయిదా గురించి వార్తలు రావడం వెనుక కారణం ఇదేనని తెలుస్తోంది. ఇది మాస్ రాజా సినిమాను చూసి భయపడటమేమీ కాదు. కాకపోతే హీరోగా అఖిల్ కెరీర్ కు కీలకమైన సినిమా కాబట్టి.. పోటీ తక్కువుంటే బావుంటుందని ఫీలవుతున్నారట. బెంగాల్ టైగర్ కాకుండా శంకరాభరణం, చీకటి రాజ్యం కూడా కొంచెం గ్యాప్ లో దీపావళికే వస్తున్నాయి. ఐతే శంకరాభరణం చిన్న సినిమా, పైగా 6న విడుదలవుతుంది. చీకటి రాజ్యం ద్విభాషా చిత్రం కాబట్టి దాన్ని కదిపే అవకాశాల్లేవు. పైగా దానికి మరీ అంత క్రేజ్ ఏమీ ఉండదు. కాబట్టే ‘బెంగాల్ టైగర్’ టీంతో సర్దుబాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.