అక్కినేని హీరో అఖిల్ రాకకు రంగం సిద్ధమైంది. దసరా బరిలో ముహూర్తం ఫిక్స్ చేసేశారు. ఎట్టి పరిస్థితుల్లో అఖిల్ సినిమా రిలీజ్ విజయదశమికే. మరి మొదటి సినిమా ఓ కన్ క్లూజన్ కి వచ్చేసినట్టే. అలాంటప్పుడు మరి రెండో సినిమాకి సంబంధించిన ప్రణాళికలేమిటి? ద‌్వితీయ ప్రయత్నం ఏ దర్శకుడితో సినిమా చేయాలనుకుంటున్నాడు? జాబితాలో ఎంతమంది దర్శకులు ఉన్నారు? ఆరా తీస్తే తెలిసిన సంగతులివి...
అసలు అఖిల్ జాబితాలో ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్ లంతా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్, కొరటాల శివ.. ఇంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లందరితోనూ సినిమాలు చేసేస్తానని అంటున్నాడు. అన్నీ కుదిరితే అఖిల్ నటించే రెండో సినిమా జనవరిలోనే సెట్స్ కెళుతుంది. అఖిల్ ఫలితం పరిశీలించి కాస్త గ్యాప్ తీసుకుని తన రెండో సినిమాని వచ్చే ఏడాది ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు.
అఖిల్ కి ఇప్పటికే దర్శకులపై ఓ అవగాహన వచ్చింది. తనకి నచ్చే కథల్ని ఎవరు ఇస్తారో? తనకి ఏ జోనర్ కావాలో? ఐడియా వచ్చేసిందని అర్థమవుతోంది కదూ? తండ్రి నాగార్జున లానే కాస్త ప్రయోగాత్మక స్క్రిప్టుల్ని ఎంచుకుంటూ కమర్షియల్ హిట్లు కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడా ఏం? కాకపోతే అన్నింటిలో కిక్కిచేది ఏంటంటే.. తొలి సినిమా రిలీజయ్యేవరకు డెసిషన్ తీసుకోను అనడం. అనవసర ఆవేశం అఖిల్ లో లేదని ఈ విషయంతో చెప్పయేవచ్చు.