బ్లాక్ బస్టర్ వద్దనుకున్న అఖిల్

Update: 2017-12-28 08:30 GMT
బాలీవుడ్ మూవీ యే జవానీ హై దివానీ.. సెన్సేషనల్ మూవీ. 2013లో వచ్చిన ఈ రొమాంటిక్ ఎంటర్టెయినర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి.. రణబీర్ కపూర్- దీపికా పదుకొనేలకు మెమరబుల్ హిట్ ఇచ్చింది. ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేయాలని తలచారు ఫిలిం మేకర్స్.

తెలుగులో కూడా ఈ జవానీని రీమేక్ చేసే ప్రయత్నాలు గట్టిగానే జరిగాయి. ఇందులో నాగార్జున పేరు ఎక్కువగా వినిపించింది. అఖిల్ రీలాంఛింగ్ మూవీగా ఈ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ విషయాన్ని అక్కినేని అఖిల్ కూడా ఒప్పుకున్నాడు. హలో సక్సెస్ మీట్ లో పాల్గొన్న అఖిల్.. యే జవానీ హై దివానీ మూవీ రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని అన్న అఖిల్.. ఇదంతా హలో ప్రాజెక్ట్ డిస్కషన్స్ కు ముందు జరిగిన వ్యవహారం అని చెప్పాడు. అయితే.. విక్రమ్ కె కుమార్ హలో స్టోరీ లైన్ చెప్పిన తర్వాత.. ఏ మాత్రం వెనుతిరిగి చూసుకోలేదని చెబుతున్నాడు అఖిల్.

75 కోట్ల ఖర్చుతో తెరకెక్కి.. 4 రెట్లు వసూళ్లు సాధించిన చిత్రంగా యే జవానీ హై దివానీకి రికార్డ్ ఉంది. అలాంటి ప్రాజెక్టును కాదని అనుకోవడానికి.. డైరెక్ట్ సినిమా చేయాలనే ఆలోచనే కారణంగా తెలుస్తోంది. అయితే.. ఆ చిత్రాన్ని వద్దని.. డైరెక్ట్ మూవీ హలో చేసినా.. దీనికి కూడా సక్సెస్ టాక్ రావడంతో.. అక్కినేని అండ్ టీం ఖుషీగానే ఉన్నారు.
Tags:    

Similar News