ఇప్పటికే దసరా పండుగను మిస్ చేసుకొని పెద్ద రిస్కే చేశాడు అఖిల్. మనోడు ''అఖిల్'' సినిమాతో ఈ సెలవుల్లో బెండు తీస్తాడని అనుకుంటే.. సడన్ గా ఈ సినిమా పోస్టుపోన్ అయిపోయింది. అయితే ఇప్పటికిప్పుడు కొత్త తేదీని ప్రకటించడం ఎందుకొని.. గ్రాఫిక్సు కారణంగా సినిమా విడుదల లేటవుతోంది అని చెప్పారు కాని.. సినిమా రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు.
కట్ చేస్తే.. దీపావళి నాటికైనా అఖిల్ వస్తాడా అనే సందేహం అందరికీ ఉంది. కాని ఇంతవరకు ఆ విషయం గురించి ఎక్కడా ఏ న్యూసూ పొక్కట్లేదు. కాకపోతే మనకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే.. నవంబర్ 11న దీపావళి కానుకగా ''అఖిల్''ను రంగంలోకి దించేస్తారట. కాకపోతే రిలీజ్ కు రెండు రోజుల వరకు ఈ విషయాన్ని కన్ఫాం చేయరేమో. సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తరువాతే అధికారిక ప్రకటన వెలువడే ఛాన్సుంది.
కాకపోతే నిర్మాత నితిన్.. దర్శకుడు వివి వినాయక్ మాత్రం.. ఎట్టిపరిస్థితుల్లో దీపావళి సీజన్ ను మాత్రం మిస్సవ్వరనే అందరూ నమ్మతున్నారు. అందుకే అఖిల్ 11న రావడం కాయం అన్నట్లు ఆల్రెడీ టాక్ బయలుదేరింది. సర్లేండి.. దసరాకు రిలీజవ్వలేదని ఇప్పటికే అభిమానుల్లో అలజడి ఉంది.. త్వరగా టాపాసుల పండుగ నాటికి వచ్చేస్తే.. వాళ్లు కూడా హ్యాపీస్ అయిపోతారు.