నవంబర్ 11న, దీపావళి పండుగనాడు అఖిల్ రిలీజ్ అవుతుందని ఇప్పటికే తెలుసు. కాకపోతే దసరాకి ఇచ్చిన ఝలక్ కారణంగా.. ఒకటీ అరా జనాలకి కాసత్ డౌట్ ఉంది. ఇప్పుడలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోనవసరం లేదు. అఖిల్ ఆ రోజుకే ఫిక్సయిపోయాడు. అఖిల్ ని సెన్సార్ కి పంపించి సర్టిఫికేట్ కూడా తెచ్చేసుకున్నారు.
'అఖిల్.. ది పవర్ ఆఫ్ జువా'కి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇది ఎక్స్ పెక్ట్ చేసిన విషయమే లెండి. ఎందుకంటే డైరెక్టర్ వీవీ వినాయక్ కదా.. ఆమాత్రం యాక్షన్ డోస్ ఉంటుంది మరి. మూవీ రన్నింగ్ కూడా చాలా స్పీడ్ గా ఉందని టాక్. ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా చేయడం.. ఎక్కడా ల్యాగ్ అనేదే లేకుండా పర్ఫెక్ట్ గా ఉందని తెలుస్తోంది. 2గంటల 10 నిమిషాల నిడివితో.. అభిమానులను అఖిల్ కేకలు పెట్టించనున్నాడు.
అక్కినేని వంశంలో మాస్ హీరో - డ్యాన్సుల్లో కుమ్మేస్తున్నాడని చెప్పే మేకింగ్ విజువల్స్ - అద్భుతమైన లొకేషన్స్ - ఫ్యామిలీ సెంటిమెంట్ - బోలెడన్ని కామెడీ సీన్స్ - సాయేషా సైగల్ అందాలు - వినాయక్ డైరెక్షన్.. వీటన్నిటికీ మించి నాగార్జున తీసుకున్న స్పెషల్ కేర్.. ఇవన్నీ కలిపి అఖిల్ ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. టాక్ వినిపించేలోపే టాలీవుడ్ లో అఖిల్ కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.