అఖిల్ సెకండ్.. ఇక మొదలైందండీ!!

Update: 2017-04-03 04:24 GMT
అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. అక్కినేని వంశంలో లేటెస్ట్ హీరో అఖిల్ కోసం చాలా ఏళ్ల పాటే ఎదురుచూశారు అభిమానులు. అక్కినేని ఫ్యామిలీలో తొలి మాస్ హీరోగా అఖిల్ అవతరిస్తాడన్నది వారి కోరిక. తొలి సినిమా అఖిల్ నిరుత్సాహపరచడంతో రెండో సినిమాతో సత్తా చాటుతాడన్నది వారి నమ్మకం.

అభిమానుల నమ్మకం నిలబెట్టేందుకు.. అఖిల్ కెరీర్ కి సరైన బూస్టప్ అందించేందుకు .. చాలానే జాగ్రత్తలు తీసుకున్న నాగార్జున.. అఖిల్ రెండో చిత్రాన్ని తానే నిర్మించాలని ఫిక్స్ అయ్యారు. ఎన్నో స్టోరీలు.. మరెందరో దర్శకులు.. స్టోరీ రైటర్లతో సంప్రదింపుల తర్వాత.. చివరకు విక్రమ్ కె కుమార్ చేతిలో అఖిల్ ను పెట్టేశారు. మనం మూవీలో అఖిల్ ను తొలిసారిగా తెరపై చూపించిన ఈ దర్శకుడే.. ఇప్పుడు అఖిల్ రెండో సినిమాను రూపొందించనుండడం విశేషం. ఆదివారం నాడు అన్నపూర్ణ స్టూడియోస్ లో.. పూజా కార్యక్రమాల నిర్వహించి ఈ మూవీ షూటింగ్ ప్రారంభించేశారు.

ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున.. అమల.. నాగచైతన్యలతో పాటు పలువురు కుటుంబ సభ్యులు.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు వంటి సినీ పెద్దలు హాజరయ్యారు. 'ఎక్కడ ఎక్కడ ఉందో తారక' అనే టైటిల్ ను ఈ చిత్రానికి ఖాయం చేసే అవకాశాలున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు ప్రకటిస్తారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News