ఆటల్లో ఏదన్న దెబ్బ తగిలితే లైట్ తీసుకోవాలని అంటారు కానీ.. అక్కినేని నవతరం వారసుడు అఖిల్ చేతికి గట్టి గాయమే తగిలింది. ఇప్పుడు అతను ఎక్కడ కనిపించినా చేతికి కట్టుతోనే కనిపిస్తున్నాడు. దీనికి కారణం క్రికెట్ మ్యాచ్ సందర్భంగా తగిలిన గాయమే అని తెలుస్తోంది. రీసెంట్ గా జరిగిన సీసీఎల్6 కప్పును తెలుగు వారియర్స్ గెలుచుకున్నారు. ఈ టీంలో అఖిల్ ప్రధానమైన సభ్యుడు. బ్యాటింగ్ - బౌలింగ్ లో కూడా సత్తా చాటి కప్పు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.
కానీ ఓ మ్యాచ్ సందర్భంగా అఖిల్ ఎడమ చేతి కండరాకు గాయం అయింది. ఇది తీవ్రమైన నొప్పిని కలిగించడంతో.. ఆస్పత్రిని ఆశ్రయించక తప్పలేదు. అయితే, ఎముక విరగలేదని, కండరాలు చిట్లాయని చెప్పారు వైద్యులు. అంతే కాదు.. తగిన వైద్యం చేసి రెండు వారాల పాటు చేతికి రెస్ట్ ఇవ్వాల్సిందిగా సూచించారు. అందుకే ఇప్పుడు అఖిల్ ఎక్కడికి వెళ్లినా చేతికి కట్టుతో కనిపిస్తున్నాడు అఖిల్.
మరోవైపు తన రెండో చిత్రం కోసం కథలు కూడా వింటున్నాడు ఈ అక్కినేని హీరో. మొదటి మూవీ అఖిల్ డిజాస్టర్ గా మిగలడంతో.. రెండో సినిమా విషయంలో మొత్తం అక్కినేని ఫ్యామిలీ చాలా అలర్ట్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సెకండ్ మూవీని సక్సెస్ చేయాలనే పట్టుదల కుటుంబంలో కనిపిస్తోంది. అఖిల్ సెకండ్ ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే చేసే అవకాశం ఉంది.