అఖిలాండ కోటిని నాగ్ మెప్పించేశాడు

Update: 2017-02-09 07:49 GMT
రిలీజ్ కి ముందు ఓ మూవీలోని పూర్తి సాంగ్ ను రిలీజ్ చేయడం అనే కల్చర్ టాలీవుడ్ లో లేదు. జస్ట్ సాంగ్ ప్రోమోతో సరిపెట్టేస్తారంతే. తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకూ.. సినిమాకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో.. పాటలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఇలా పాటలకు ప్రోమోలతో సరిపెట్టేస్తారు. కానీ ఓం నమో వేంకటేశాయ చిత్ర యూనిట్ మాత్రం ట్రెండ్ ని బ్రేక్ చేసేశారు.

రేపు రిలీజ్ ఉందనగా.. సినిమాలోని అత్యంత కీలకమైన 'అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా' పూర్తి పాటను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసేయడం విశేషం. శ్రీనివాసుడికి అన్ని రకాలు పూలతో పూజలు చేసే సందర్భంగా వచ్చే ఈ పాటను.. భక్తుడు హథీరాం బాబాగా నాగార్జున పాడతారు. ఈ పాటలో అనుష్క కూడా భక్తురాలిగా దర్శనమిస్తుంది. సినిమాను ఎంత రిచ్ గా హై బడ్జెట్ తో తెరకెక్కించారో చెప్పేందుకు ఈ పాటను ఓ మచ్చుతునకగా చెప్పుకోవాలి.

వేంకటేశుని సన్నిధిలో ఒకటే లొకేషన్ లో తీసిన పాట అయినా సరే.. ఎక్కడా ఆ ఆలోచన కూడా రాకుండా తెరకెక్కించిన విధానాన్ని ప్రశంసించాల్సిందే. లిరికల్ గా కూడా  పాట బాగా ఆకట్టుకుంటుంది అఖిలాండ కోటి. పాట మొత్తం పూర్తయ్యాక కానీ.. వైకుంఠంలో ఉన్న వేంకటేశ్వరుని చూపించకుండా పిక్చరైజ్ చేసిన తీరు కూడా మెప్పిస్తుంది. కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేయడంతో పాటు.. అద్భుతమైన భక్తి పాటను అందించిన ఓం నమో వేంకటేశాయ టీంకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News