పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అఖీరా నందన్ ఇప్పటి నుంచే యూత్ ను అట్రాక్ట్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో మనోడి ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపించడం ఖాయం. నూనూగు మీసాలతో, పాల బుగ్గలతో మెరిసిపోతున్న అఖీరాను చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతుంటారు. అయితే.. ఇవాళ వారికి వెరీ వెరీ స్పెషల్ డే.
నేడు అఖీరా నందన్ బర్త్ డే. రేపు వకీల్ సాబ్ రిలీజ్. ఇంకేముందీ? సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అఖిరాకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ గ్రీటింగ్స్ లో తడిసి ముద్దైపోతున్నాడు అఖీరా. ఈ సందర్భంగానే రేణుదేశాయ్ తన కుమారుడికి సంబంధించిన పిక్స్ పోస్ట్ చేసింది. కేకపెట్టిస్తున్న ఆ ఫొటోలను చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
ఈ ఫొటోల్లో అఖీరా సంప్రదాయ దుస్తుల్లో కనిపించాడు. పంచెకట్టు, లాల్చీలో అద్దిరిపోయే కటౌట్ లా ఉన్నాడు. ఈ ఫొటోలే కేక పెట్టిస్తున్నాయంటే.. అఖీరా వేసిన ప్రశ్న - దానికి తల్లి చెప్పిన సమాధానం కూడా ఆసక్తికరంగ ఉంది.
ఈ రోజుల్లో యూత్ పంచె కట్టుకుంటే జనాలు ప్రత్యేకంగా చూస్తుంటారన్న సంగతి తెలిసిందే. అఖీరా నందన్ కు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైనట్టుంది. వెంటనే తల్లిని అడిగేశాడట. ‘ఆడవాళ్లు చీర కట్టుకోవడం చాలా సాధారణం. మరి, మగవారు పంచె కట్టుకుంటే ఎందుకు ప్రత్యేకంగా చూస్తారు’ అని అడిగాడట.
దీనికి.. రేణుదేశాయ్ బదులిస్తూ.. అది కేవలం జనాల మైండ్ సెట్ అని, కంఫర్ట్ ను బట్టి ఎలాంటి దుస్తులు అయినా వేసుకోవచ్చు అని చెప్పిందట. అయితే.. పంచె కట్టుకోవడం మన సంప్రదాయం అని తెలిపిందట. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. యూత్ మన సంప్రదాయాలను గుర్తుంచుకోవాలని కూడా గుర్తు చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో అఖీరా ఫొటో, రేణు కామెంట్ వైరల్ అవుతున్నాయి.