రేణు దేశాయ్‌ కి కొడుకు - కాబోయే భర్త ఎమోషనల్ మెసేజ్‌

Update: 2019-04-17 05:27 GMT
పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్యగా తెలుగు వారందరికి కూడా సుపరిచితురాలైన రేణు దేశాయ్‌ తాజాగా ఈటీవీలో ప్రసారం అయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్‌ నుండి విడాకులు తీసుకుని చాలా ఏళ్లు అయినా కూడా రేణు దేశాయ్‌ గురించి ఇంకా కూడా తెలుగు జనాల్లో చర్చ జరుగుతోంది. ఆమె ఏం చేసినా కూడా సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు. పవన్‌ పిల్లలు ఇద్దరు ఆమె వద్ద ఉన్న కారణమో లేక మరేంటో కాని ఆమెను ఇంకా పవన్‌ భార్యగానే అభిమానులు చూస్తున్నారు. ఒంటరి జీవితంను ఇన్నాళ్లు గడిపిన రేణుదేశాయ్‌ ఇప్పుడు పెళ్లికి సిద్దం అయ్యింది. పెళ్లి నిశ్చితార్థం జరిగి నెలలు గడుస్తోంది. అయితే పెళ్లి మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. పెళ్లి - తన కాబోయే భర్త మరియు పిల్లల గురించి ఆలీతో సరదాగా కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలను రేణు దేశాయ్‌ వెళ్లడించింది. ఇదే సమయంలో రేణు దేశాయ్‌ కాబోయే భర్త మరియు కొడుకు అకీరాల వాయిస్‌ మెసేజ్‌ ను కార్యక్రమంలో ప్రసారం చేయడం జరిగింది.

రేణు దేశాయ్‌ ని ఉద్దేశించి అకీరా వాయిస్‌ మెసేజ్‌ లో మాట్లాడుతూ.. నేను చూసిన మహిళల్లో అత్యంత అందమైన మరియు బలమైన మహిళవు నువ్వే అమ్మ - మాకు జన్మను ఇచ్చి - ప్రేమను పంచి మమ్ముల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశావు. నీపై నాకున్న ప్రేమను చెప్పేందుకు నా వద్ద ఉన్న పదాలు సరిపోవు - ఐలవ్‌ యూ అమ్మా - నేను ఎప్పుడు కూడా నీ పక్షమే అంటూ చెప్పుకొచ్చాడు. అకీరా మాటలకు రేణు ఎమోషనల్‌ అయ్యింది. ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడంటూ కన్నీరు పెట్టుకుంది.

ఇక రేణు దేశాయ్‌ చేసుకోబోతున్న వ్యక్తి కూడా ఒక వాయిస్‌ మెసేజ్‌ లో మాట్లాడుతూ.. నాకు తెలిసిన ఒక అద్బుతమైన వ్యక్తి రేణు - నువ్వు చేస్తున్న పనులు ఎన్నో నేను గర్వ పడేలా చేస్తున్నాయి. ఒక సింగిల్‌ మదర్‌ గా నువ్వు అకీరా - ఆద్యలను పెంచిన తీరును నేను ఎప్పటికి మర్చిపోను - నీ కేరింగ్‌ - లవ్‌ నీ వారికి చాలా బలాన్ని ఇస్తాయి. కష్ట సమయంలో నువ్వు బౌన్స్‌ బ్యాక్‌ అయ్యే తీరు చాలా గొప్పగా ఉంటుంది. నీవు ఇంటి పనులు - ఇతర పనులు చేసే విధానం నాకు బాగా నచ్చుతుంది. నువ్వు కేవలం ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ మాత్రమే కాదు.. ఉమెన్‌ ఆఫ్‌ ది డికేడ్‌ - సెంచరీ నువ్వు నా జీవితంలోకి రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.

కాబోయే భర్త మాటలకు రేణు తెగ మురిసి పోయింది. ఇద్దరికి పిల్లలు ఉన్న కారణంగా పెళ్లి కాస్త ఆలస్యం అవుతుందని - హడావుడిగా చేసుకోవాలని తామేం భావించడం లేదు. అన్ని అనుకున్నట్లుగా జరుగుతున్నాయి. త్వరలోనే పెళ్లి ఉంటుందని రేణు దేశాయ్‌ చెప్పుకొచ్చింది. తనకు కాబోయే భర్త అమెరికా రిటర్న్‌ అని, ప్రస్తుతం పుణెలో జాబ్‌ చేస్తున్నాడని చెప్పుకొచ్చింది.


Tags:    

Similar News