కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాదట.. అఖిల్ సినిమాకు సంబంధించి చాలా విషయాల్లో నాగార్జునకు అభ్యంతరాలున్నాయట. రిపేర్లు, రీషూట్లు జరుగుతున్నాయట. అందుకే రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వలేకపోతున్నారట.. అఖిల్ సినిమా అసలీ ఏడాదే విడుదల కాదట.. ఇలా ఎన్నెన్నో రూమర్లు వినిపిస్తున్నాయి కొన్ని రోజుల నుంచి. నిర్మాత నితిన్, డైరెక్టర్ వి.వి.వినాయక్ ల సైలెన్స్ ఈ రూమర్లకు మరింత బలం చేకూరుస్తోంది. ఐతే రోజు రోజుకూ ఊహాగానాలు మరీ ఎక్కువైపోతుండటంతో అఖిల్ డ్యామేజ్ కంట్రోల్ పనిలో పడ్డాడు. మొన్నా మధ్య సినిమాకు సంబంధించి వర్క్ యమ స్పీడు మీద జరిగిపోతోందని చెప్పిన అఖిల్.. తాజాగా రీషూట్ రూమర్ల మీదా స్పందించాడు.
అఖిల్ సినిమా విషయంలో రీషూట్లు జరుగుతున్నాయని చాలా రూమర్లు వస్తున్నాయని అవన్నీ శుద్ధ అబద్ధమని.. అలాంటిదేమీ జరగట్లేదని స్పష్టం చేశాడు అఖిల్. ఇలాంటి వార్తలు కట్టి పెట్టాలని ట్విట్టర్ ద్వారా కోరాడు. ఐతే రీషూట్ రూమర్ల గురించి ఖండించడం.. బ్యాలెన్స్ వర్క్ జోరుగా జరుగుతోందని చెప్పడం వరకు బాగానే ఉంది కానీ.. అసలు రిలీజ్ డేట్ గురించి మాట్లాడకపోవడమే అనుమానాలకు తావిస్తోంది. కొన్ని రోజుల్లో పనైపోతుందని.. రిలీజ్ డేట్ ఇచ్చేస్తామని అన్న నాగ్ పత్తా లేడు. దర్శకుడు, నిర్మాత మౌన వ్రతం పాటిస్తున్నారు. హీరో అఖిల్ అభిమానులతో టచ్ లో ఉంటున్నాడు కానీ.. రిలీజ్ డేట్ సంగతి మాత్రం తేల్చట్లేదు. దీంతో దీపావళికైనా సినిమా వస్తుందా రాదా అనే విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది.