ఆ డైరెక్టర్ కూడా డేంజర్ జోన్ లోనే!
అతడికి మహిళా అభిమానులు ఎక్కువ. కానీ రావిపూడి ఇలా ఎక్కువ కాలం కొనసాగడం కష్టం. ట్రెండ్ కి దూరంగానే అతడి సినిమాలుంటున్నాయనే విమర్శ వినిపిస్తుంది.
ఔడెటెడ్ స్టోరీలతో సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో తెలిసిందే. అవకాశాలు లేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. ఇండస్ట్రీతో పాటు అప్ డేట్ కాకపోతే? నెటి జనరేషన్ ని మెప్పించడం సాద్యమయ్యేది కాదు. ఇప్పటికే ఈ లిస్ట్ లో కొంత మంది దర్శకులున్నారు. వి. వి. వినాయక్, శ్రీనువైట్ల, కృష్ణవంశీ, రాంగోపాల్ వర్మ, సురేందర్ రెడ్డి, శ్రీకాంత్ అడ్డాల ఇలా కొంత మంది కాదు చాలా మంది దర్శకులున్నారు. వీళ్లంతా ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు చేసిన వారు. కానీ ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి.
తాజాగా ఈ జాబితాలో పూరి జగన్నాధ్ కూడా చేరే పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల ఆయన నుంచి రిలీజ్ అయిన 'డబుల్ ఇస్మార్ట్' ఎలాంటి ఫలితం సాధించిందో తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో ఫ్యామిలీ సినిమాలకు చాలా కాల కాలం క్రితమే కాలం చెల్లిపోయింది. ఫ్యామిలీ సినిమాలు..సెంటిమెంట్ ని బేస్ చేసుకుని ఏ దర్శకుడు కథలు రాయడం లేదు. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. థ్రిల్లర్ , సస్పెన్స్ జానర్లో సినిమాలు చేస్తూ విజయాలు అందుకుం టున్నారు.
ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన కుర్రాళ్లే ఈ తరహా హిట్లు అందుకుంటున్నారు. పాన్ ఇండియాకి కనెక్ట్ అయ్యేలా యూనివర్శల్ పాయింట్ ని రాసుకుని సినిమాలు చేసేది మరికొంత మంది. ఇప్పుడిదే ట్రెండ్. అయితే నెటి జనరేషన్ దర్శకుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని అనీల్ రావిపూడి తన సినిమాలో అలరిస్తున్నాడు. ఇప్పటివరకూ అతడు తెరకెక్కించిన సినిమాలన్నీ హాస్యం, ఎమోషన్, ఫ్యామిలీ బేసిస్ లో చేసి సక్సెస్ అందుకున్నారు.
అయితే అవి ఆడటం వెనుక హీరోల ఇమేజ్ అన్నది అత్యంత కీలక పాత్ర పోషించింది. ఆజానర్ సినిమాలు కొత్త వారితో చేస్తే ఫలితాలు మరోలా ఉంటాయి. అందుకే అనీల్ తెలివిగా తన కథలకి స్టార్ హీరోల్ని లాక్ చేసి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో ఓ సినిమా చేస్తున్నాడు. వెంకటేష్ అంటే ఫ్యామిలీ హీరో. అతడికి మహిళా అభిమానులు ఎక్కువ. కానీ రావిపూడి ఇలా ఎక్కువ కాలం కొనసాగడం కష్టం. ట్రెండ్ కి దూరంగానే అతడి సినిమాలుంటున్నాయనే విమర్శ వినిపిస్తుంది.