అక్కినేని వారి కోడలు భలే తప్పించుకుందే

Update: 2017-02-27 06:59 GMT
ఈ మధ్యన మీడియా తాకిడి అన్ని విషయాల్లోనూ బాగా ఎక్కువైంది. అసలు సెన్సేషనలిజం పేరుతో మనోళ్ళు సెన్సిబిలిటీ లేకుండా రెచ్చిపోతున్న మాట కూడా వాస్తవమే. అందుకే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తమ జాగ్రత్తల్లో తాము ఉంటున్నారు.

అసలు అఖిల్ అక్కినేని పెళ్ళి క్యాన్సిల్ అయ్యింది అనగానే అది పెద్ద న్యూస్ అయిపోయింది. అఫీషియల్ గా ఎటువంటి ఎనౌన్స్ మెంట్ చెప్పకపోయినా కూడా.. సాధారణంగా ప్రతీ విషయాన్ని ట్విట్టర్లో ఖండించేసే నాగార్జున అండ్ అఖిల్ కూడా చాలా సైలెంట్ గా ఉండటంతో.. అందరూ ఈ విషయం కరక్టే అనుకుంటున్నారు. ఈ సమయంలో ఎవరైనా అక్కినేని ఫ్యామిలీ మెంబర్ కెమెరాకు చిక్కితే మనోళ్ళు వదిలిపెడతారా? వెంటనే ప్రశ్నల వర్షం కురిపించేయరూ. అందుకే నిన్న హైదరాబాదులో రెండు వేర్వేరు ఈవెంట్లలో పాలుపంచుకున్న అక్కినేని వారి కోడలు అమల ముఖర్జీ.. అసలు కెమెరా కు మైకుకు ప్రత్యేకంగా దొరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

హైదారాబాద్లో ఒక ఆర్ట్ షో.. అలాగే ఒక సెలూన్ ప్రారంభించిన అమల.. అక్కడ జర్నలిస్టులతో మాత్రం మాట్లాడలేదు. కేవలం ఫోటోలు దిగేసి వెళిపోయారంతే. ఒకవేళ ఆగి మాట్లాడితే ఎటువంటి ప్రశ్నలను ఫేస్ చేయాల్సి వచ్చేదో మనకు తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News